Ajith Kumar: అజిత్, బేబి షాలినిల కూతురిని చూశారా ?.. ఎంత అందంగా ఉందో …

అమరకలమ్ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ సంఘటనతో వీరిద్దరూ దగ్గరయ్యారు. షూటింగ్ జరుగుతుండగా.. షాలిని చేతిని అజిత్ పొరపాటున కట్ చేశారు. దీంతో ఇబ్బంది ఫీలయిన అజిత్.. ఆ గాయం తగ్గే వరకూ రోజు ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఇక జాగ్రత్తనే ప్రేమగా పెళ్లి వరకు చేరింది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది షాలిని. మరోవైపు అజిత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Ajith Kumar: అజిత్, బేబి షాలినిల కూతురిని చూశారా ?.. ఎంత అందంగా ఉందో ...
Ajith Shalini

Updated on: Jun 24, 2023 | 9:14 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్ అజిత్ కుమార్, షాలిని. అమరకలమ్ సినిమాతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరిద్దరూ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 2000 ఏప్రిల్ 25న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి పాప అనౌష్క, బాబు ఆద్విక్ ఉన్నారు. అమరకలమ్ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ సంఘటనతో వీరిద్దరూ దగ్గరయ్యారు. షూటింగ్ జరుగుతుండగా.. షాలిని చేతిని అజిత్ పొరపాటున కట్ చేశారు. దీంతో ఇబ్బంది ఫీలయిన అజిత్.. ఆ గాయం తగ్గే వరకూ రోజు ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఇక జాగ్రత్తనే ప్రేమగా పెళ్లి వరకు చేరింది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది షాలిని. మరోవైపు అజిత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో తునీవు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజిత్. తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇక తెలుగులో తెగింపు పేరుతో విడుదలైంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో. గతంలో అజిత్ నటించిన సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. అజిత్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అంతేకాదు.. ఇప్పటికీ సొంతంగా మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించరు.

ఇక అజిత్ ఫ్యామిలీ సైతం సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రమే వీరి కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుంటాయి. తాజాగా అజిత్, బేబీ షాలిని పిల్లల ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో అజిత్ కూతురు అనౌష్క మరింత అందంగా కనిపిస్తుంది. అందంలో తల్లిని మించిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

Anoushka

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.