Tollywood: గెస్ట్ రోల్ కోసం భారీగా డిమాండ్.. 8 నిమిషాల సీన్‏కు 35 కోట్లు తీసుకున్న హీరో.. ఎవరంటే..

ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో సైఫ్.. ఇప్పుడు దేవర సినిమాలోనూ నటిస్తున్నారు. అలాగే కేజీఎఫ్ మూవీతో సంజయ్ దత్ దగ్గరవ్వగా.. ఇప్పుడు ఓజీ సినిమాతో హీరో ఇమ్రాన్ హష్మీ సౌత్ అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే..ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ తెలుగు సినిమాల్లో అతిథి పాత్రల కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్.

Tollywood: గెస్ట్ రోల్ కోసం భారీగా డిమాండ్.. 8 నిమిషాల సీన్‏కు 35 కోట్లు తీసుకున్న హీరో.. ఎవరంటే..
Actor
Follow us

|

Updated on: Feb 23, 2024 | 7:36 PM

తెలుగు సినిమా స్థాయి జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది. టాలీవుడ్ మూవీస్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కేజీఎఫ్, పుష్ప, ట్రిపుల్ ఆర్, కాంతార సినిమాలకు ఉత్తరాదిలో ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు. దీంతో సౌత్ మూవీస్ చేసేందుకు బాలీవుడ్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో సైఫ్.. ఇప్పుడు దేవర సినిమాలోనూ నటిస్తున్నారు. అలాగే కేజీఎఫ్ మూవీతో సంజయ్ దత్ దగ్గరవ్వగా.. ఇప్పుడు ఓజీ సినిమాతో హీరో ఇమ్రాన్ హష్మీ సౌత్ అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే..ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ తెలుగు సినిమాల్లో అతిథి పాత్రల కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్.

బాలీవుడ్ నటుడు అతిథి పాత్రలో నటించేందుకు దాదాపు రూ. 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. అంటే నిమిషానికి రూ. 4.5 కోట్లు అన్నమాట. ఇంతకీ ఆ ప్రముఖ నటుడు ఎవరో తెలుసా? రజనీకాంత్, తలపతి విజయ్, ప్రభాస్, రామ్ చరణ్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి నటులు భారతీయ సినిమా అగ్ర నటులుగా గుర్తింపు పొందారు. ఈ నటీనటులు నటించే సినిమాలు ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాలే. ఈ హీరోలు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగానే సంపాదిస్తున్నారు. కొందరికి తమ సినిమాల లాభాల్లో వాటాలు కూడా వస్తాయి. దీంతో కొందరికి రూ. 200 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే వారు నటించే సినిమాల్లో నిమిషానికి వచ్చే జీతం రూ. 2 కోట్ల నుంచి రూ.3 కోట్లు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ట్రిపుల్ ఆర్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఆ సీన్‌లో నటించినందుకు అజయ్ దేవగన్ 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. 8 నిమిషాల సీన్‌కి నిమిషానికి 4.5 కోట్లు, 8 నిమిషాలకు 35 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 8 నిమిషాల పాటు వచ్చే ఆ సీన్‌లో అజయ్‌ దేవగన్‌ క్యారెక్టర్‌ చాలా కీలకం. సినిమాలో కేవలం కొన్ని నిమిషాలే అయినా నటుడు అజయ్ దేవగన్ పాత్ర చాలా ముఖ్యమైనది. సాధారణంగా అజయ్ ఒక్కో సినిమాకు రూ. 35 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే సినిమా లాభాల్లో అతడికి 50 శాతం ఇవ్వనున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.