
దక్షిణాది చిత్రపరిశ్రమలో నటి ఊర్వశి చాలా పాపులర్. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ మీకు తెలుసా.. ఊర్వశి చైల్డ్ ఆర్టిస్టు. తెలుగులో అంతిమ తీర్పు, చెట్టుకింద ప్లీడర్, పాడుతా తీయగా, విజయ రామరాజు, సందడే సందడి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కొన్నాళ్లపాటు హీరోయిన్ గా వెండితెరపై సందడి చేసిన ఊర్వశి.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 700లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అద్భుతమైన నటన, అంతకు మించి కామెడీ టైమింగ్ తో వెండితెరపై నవ్వులు పూయిస్తుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది.
అయితే ఇప్పుడు ఊర్వశి కుతురు ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అందులో ఆమె గ్లామర్ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఊర్వశి కూతురు ముందు హీరోయిన్స్ సైతం దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2000లో ఊర్వశి మలయాళ నటుడు మనోజ్ జైన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి జన్మించింది. ఆ తర్వాత కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు.
ఊర్వశి కూతురు తేజ లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది. ప్రస్తుతం తేజ లక్ష్మి కిక్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటుంది. అలాగే త్వరలోనే ఆమె సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..