చాలామంది లాగే ఈ నటుడు కూడా ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అక్కడే పెరిగాడు. తండ్రి ఓ సాధారణ రైతు. చదువుకోసం సొంతూరును వదలిపెట్టాల్సి వచ్చింది. కానీ పక్క ఊరిలో చదువంంటే మాటలా? బోలెడు ఖర్చు. అందుకే చదువుకుంటూనే వాచ్ మెన్ ఉద్యోగం చేశాడు. కేవలం రూ.165ల జీతంతో రాత్రింబవళ్లు కష్టించి పనిచేశాడు. అదే సమయంలో నాటకాలు కూడా వేస్తుండే వాడు. అలా ముంబైకు వెళ్లివర్క్ షాపులు కూడా తీసుకున్నాడు. యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు భారతీ య సినిమా ఇండస్ట్రీలో గర్వించదగ్గ నటుల్లో ఒకడిగా మారిపోయాడు. అతనే సాయాజీ షిండే. విలన్ గా, సహాయక నటుడిగా ఎలాంటి పాత్రలనైనా పోషించే ఈ యాక్టర్ ఇటీవలే పుట్టిన రోజు జరపుకొన్నాడు. ఈ సందర్భంగా షిండే గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు సాయాజీ షిండే. తండ్రి ఓ సాధారణ రైతు. కొంతకాలం తర్వాత, సాయాజీ సొంతూరు విడిచిపెట్టి సతారా నగరానికి వెళ్లిపోయాడు. అక్కడే చదువుకున్నాడు. అదే సమయంలో వాచ్‌మెన్‌గా కూడా పనిచేస్తూ నెలకు రూ.165 వేతనం పొందాడట. ఆ తర్వాత నీల్ కులకర్ణి అనే వ్యక్తి సహాయంతో నాటకాల్లో పనిచేయడం ప్రారంభించాడు. ముంబైకు వెళ్లి యాక్టింగ్ లోనూ శిక్షణ తీసుకున్నాడు. క్రమంగా సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. సాయాజీ తన మొదటి హిందీ చిత్రం ‘శూల్’లో బచ్చు యాదవ్ పాత్రను పోషించాడు. తన యాక్టింగ్ తో మొదటి సినిమాలోనే అదరగొట్టాడు షిండే. ఇక తర్వాత అతనికి ఎదురులేకుండా పోయింది. మరాఠీతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ , గుజరాతీ చిత్రాలలో నటించాడీ విలక్షణ నటుడు.
One Veteran Meets another Veteran.
Old but Gold.
Actor Sayaji Shinde met with Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyanpic.twitter.com/o443app5Fd— Sambhaji Choudhary (@sambhaji4304) October 11, 2024
సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోన్న సాయాజీ షిండే ఇప్పుడు రాజకీయాల్లోనూ విజయవంతం అవ్వాలని చూస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు.
Happy Birthday Sayaji Shinde#patvathyvasanthakymar#HappyBirthdaySayajiShinde#HBDSayajiShinde#SayajiShindeBirthday#SayajiShinde pic.twitter.com/wneCciFaxP
— Unni vava (@Unnivava11) January 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి