Babloo Prithviraj: డ్రైవర్ చెప్పాడని కోట్ల ఆస్తి వదిలేసిన హీరో.. కట్‌చేస్తే..

|

May 26, 2024 | 10:08 AM

రెండున్నర దశాబ్దాల క్రితం వడ్డె నవీన్, మహేశ్వరి జంటగా నటించిన పెళ్లి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. ఈ మూవీలో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సహజ నటనకు ఏకంగా నంది అవార్డ్ సైతం వరించింది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో విలనిజం పండించాడు.

Babloo Prithviraj: డ్రైవర్ చెప్పాడని కోట్ల ఆస్తి వదిలేసిన హీరో.. కట్‌చేస్తే..
Babloo Prithviraj
Follow us on

ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‏గా, క్యారెక్టర్ ఆర్టిస్టు్‏గా ఇమేజ్ తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్.. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అటు సినిమాల్లో సహాయ పాత్రలు పోషిస్తూ.. ఇటు సీరియల్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. రెండున్నర దశాబ్దాల క్రితం వడ్డె నవీన్, మహేశ్వరి జంటగా నటించిన పెళ్లి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. ఈ మూవీలో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సహజ నటనకు ఏకంగా నంది అవార్డ్ సైతం వరించింది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో విలనిజం పండించాడు.

విలన్ గానే కాకుండా.. వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పెళ్లి పందిరి సినిమా పృథ్వీరాజ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత సమరసింహారెడ్డి, పంచదార చిలకా, ప్రేయసి రావే, సమ్మక్క సారక్క, జయం మనదేరా, దేవుళ్లు, నువ్వు నాకు నచ్చావ్, సంతోషం, చెన్నకేశవ రెడ్డి, నాగ, గౌతమ్ ఎస్ఎస్సీ, సీతకోక చిలుక వంటి అనేక చిత్రాల్లో నటించాడు. డిప్రెషన్ కారణంగా అనేక సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో కీలకపాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.

ఎన్నో చిత్రాల్లో నటించిన పృథ్వీరాజ్ తన డ్రైవర్ చెప్పిన మాట విని వందల కోట్ల ప్రాపర్టీని వదులుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజ్ బయటపెట్టాడు. గతంలో పది లక్షలకే శంషాబాద్ లో వందల ఎకరాల భూమి అమ్మకానికి వచ్చిందని అన్నాడు. తన డ్రైవర్ తో కలిసి సైట్ చూసేందుకు వెళ్లామని.. ఆ సైట్ తనకు చాలా నచ్చిందని.. వెంటనే కొనాలకున్నట్లు తెలిపాడు. కానీ తన డ్రైవర్ పక్కకు తీసుకెల్లి..ఇదంతా పనికిరాని స్థలం అని.. అంతా పెద్ద పెద్ద బండలు ఉన్నాయని .. పది లక్షలు పెట్టి ఆ ల్యాండ్ కొనడం వెస్ట్ అని చెప్పడంతో ఆ భూమి కొనకుండానే వెళ్లిపోయాడట. పృథ్వీరాజ్ వదిలేసిన అదే స్థలంలో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించారని.. ఇప్పుడు ఆ ల్యాండ్ విలువ ఎకరకు సుమారు రూ.100 కోట్లు ఉంటుందని తెలిపాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.