
సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తాయి. కానీ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్స్ అవుతుంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా హైప్ మధ్య విడుదలై ప్లాప్ అయిన సినిమాలు బోలేడు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేసిన చిత్రాలు ప్రేక్షకులను నిరాశకు గురిచేశాయి. అలాంటి జాబితాలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. అంతే కాదు ఈ సినిమాలో నటించిన వారు చాలా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్స్ . విడుదలకు ముందు తెగ ఊదరగొట్టారు. కానీ రిలీజ్ తర్వాత దారుణంగా బోల్తా పడింది. దాదాపు రూ. 320 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. స్టార్ హీరోలు నటించినా కూడా ఆ సినిమాను కాపాడలేక పోయారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..?
ఆ సినిమా ఎదో కాదు భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా “థగ్స్ ఆఫ్ హిందూస్థాన్”. ఈ సినిమా 2018లో విడుదలైంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో, 1795 నుండి 1806 మధ్య కాలంలో జరిగే ఒక కాల్పనిక కథ ఆధారంగా రూపొందించబడింది.
ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, విమర్శకుల నుండి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు పొందింది. దృశ్యాత్మకంగా గొప్పగా ఉన్నప్పటికీ, కథనం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో లోపాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఆమిర్ ఖాన్ మరియు అమితాబ్ బచ్చన్ నటన ప్రశంసలు పొందినప్పటికీ, సినిమా మొత్తంగా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దాదాపు ఏడేళ్లుగా ఈ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతుంది ఈ సినిమా. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.