Tollywood : 17 ఏళ్లకే తోపు హీరోయిన్.. 19 ఏళ్లకే భర్తతో విడాకులు.. కూతురితో ఒంటరిగా.. చివరకు.. 

నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలో సినీరంగంలోకి అడుగుపెట్టింది. చిన్న వయసులోనే అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేసింది. కానీ అనుహ్యంగా వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరిస్థితులతో సినీరంగం నుంచి తప్పుకుంది. సామాజిక ఒత్తిళ్లకు లొంగకుండా.. జీవితంలో వచ్చిన సమస్యలను అధిగమించి ఇప్పుడు నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Tollywood : 17 ఏళ్లకే తోపు హీరోయిన్.. 19 ఏళ్లకే భర్తతో విడాకులు.. కూతురితో ఒంటరిగా.. చివరకు.. 
Rukhsar Rehman

Updated on: May 20, 2025 | 4:11 PM

చిన్నప్పటి నుంచి నటి కావాలనే కోరిక..అందుకే ఎన్నో సవాళ్లను అధిగమించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అద్భుతమైన నటనతో 17 ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుంది. తొలి చిత్రం విడుదల కాకుండానే ఏకంగా మూడు సినిమాలపై సంతకం చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆమె ఆ మూూ సినిమాలు చేసేందుకు ఒప్పుకోలేదు. 17 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది. కానీ 19 ఏళ్ల వయసులోనే భర్తతో విడాకులు తీసుకుని కూతురితో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఒంటరిగా జీవిస్తూ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే ఒకప్పటి హీరోయిన్ రుఖ్సర్ రెహ్మాన్. దీపక్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాద్ రఖేగీ దునియా (1992)లో కథానాయికగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది రిషి కపూర్ సరసన ఇంతేహా ప్యార్ చిత్రంలో మెరిసింది.

17 ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్ అయ్యింది. కానీ కుటుంబం ఆదేశాల మేరకు నటన మానేసి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలోనే ఆమెకు బాజీగర్, రోజా వంటి భారీ సినిమాల ఆఫర్స్ వచ్చాయి. అప్పటికే ఆమెకు పెళ్లి చేయాలనుకున్న కుటుంబం సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోలేదు. కానీ పెళ్లి తర్వాత రుఖ్సార్ కు పాప జన్మించింది. 19 ఏళ్ల వయసులోనే భర్తతో విడాకులు తీసుకుని తన 8 నెలల కూతురితో ఇంటి నుంచి బయటకు వచ్చేశానని గతంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రుఖ్సర్. ఆ తర్వాత నటనవైపు కాుండా సొంతంగా దుస్తుల దుకాణాన్ని ప్రారంభించింది.

కొన్నాళ్లకు మరోసారి సినీరంగం వైపు అడుగులు వేసింది. దశాబ్దం తర్వాత ఆమె రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఢీ (2005) సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సర్కార్ (2005), గాడ్ తుస్సీ గ్రేట్ హో (2008), ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ (2009), బెన్నీ అండ్ బబ్లూ (2010), అల్లాహ్ కే బందాయ్ (2010), షైతాన్ (2011), PK (2014), ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ వంటి అనేక చిత్రాలలో కనిపించింది. ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతుంది రుక్సార్.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..