Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గురించి మీకు తెలుసా..? ఆ స్టార్ హీరోయిన్ కజిన్ ఈ భామ
మొత్తానికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 3 న బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది. కింగ్ నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్‌ను పరిచయం చేస్తూ హౌస్‌లోకి పంపించారు. హౌస్ లోకి ఈసారి 14 మందిని పంపించారు. అయితే హౌస్ లోకి వెళ్లిన వారు హౌస్ మేట్స్ కాదు అని షాక్ ఇచ్చారు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 7 గతంలో లా ఉండదని మరింత క్రేజీ గా ఉంటుందని ముందు నుంచి నాగార్జున చెప్తూనే ఉన్నారు. ఈసారి ఉల్టా పుల్టా అంటూనే హింట్ ఇస్తూ వచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 7 సందడి మొదలైంది. మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎవరు వెళ్తారన్నది ఆస్కతికరంగా మారింది. మొత్తానికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 3 న బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది. కింగ్ నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్‌ను పరిచయం చేస్తూ హౌస్‌లోకి పంపించారు. హౌస్ లోకి ఈసారి 14 మందిని పంపించారు. అయితే హౌస్ లోకి వెళ్లిన వారు హౌస్ మేట్స్ కాదు అని షాక్ ఇచ్చారు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 7 గతంలో లా ఉండదని మరింత క్రేజీ గా ఉంటుందని ముందు నుంచి నాగార్జున చెప్తూనే ఉన్నారు. ఈసారి ఉల్టా పుల్టా అంటూనే హింట్ ఇస్తూ వచ్చారు. చెప్పినట్టే ఈ సీజన్ ఉండనుందని అర్ధమవుతుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో.. ప్రియాంక జైన్, హీరో శివాజీ, దామిని భట్ల, మోడల్ ప్రిన్స్ యావర్,నటి శుభశ్రీ,నటి షకీలా, నటి శోభా శెట్టి,టేస్టీ తేజ,నటి రిథిక రోజ్ ,హీరో డాక్టర్ గౌతమ్ కృష్ణ, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు వీరితో పాటు నటి కిరణ్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు.
కిరణ్ రాథోడ్ చాల మందికి గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. బిగ్ బాస్ స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో సందడి చేసింది. తెలుగు, తమిళ్ మలయాళ భాషల్లో నటించింది కిరణ్. తెలుగులో ఈ అమ్మడు చేసిన స్పెషల్ సాంగ్స్ సినిమాలకు హైలైట్ గా నిలిచాయి. అలాగే కిరణ్ రాథోడ్ బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కి కజిన్ అవుతుంది. తాజాగా బిగ్ బాస్ స్టేజ్ పై కిరణ్ రాథోడ్ ను చూసిన ప్రేక్షకులను సోషల్ మీడియాను గాలిస్తూ ఆమె గురించి తెలుసుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ సెవన్ లో ఎంట్రీ ఇచ్చిన 14 మంచి హౌస్ మేట్స్ కాదని వీరిలో ఎవరు కంటెస్టెంట్స్ అవుతారో చూడాలి అంటూ నాగ్ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం హైలైట్ అనే చెప్పాలి. మరి వీరిలో హౌస్ లో ఎవరు ఉంటారో బయటకు ఎవరు వస్తారో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
