
పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు శోభితా ధూలిపాళ సుపరిచితమే. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగమ్మాయి అయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటింది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో మూవీస్ చేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది శోభితా. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది శోభితా. మోడలింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తార.. ఇప్పుడు సినీ రంగుల ప్రపంచంలో హీరోయిన్గా దూసుకుపోతుంది. ఈ ఏడాది దేవ్ పటేల్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి శోభితా అడుగుపెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పటికే నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుని తనను తాను నిరూపించుకుంది.
31 మే 1992న ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో మర్చంట్ నేవీ ఇంజనీర్ వేణుగోపాలరావు , ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శాంతా కామాక్షి దంపతులకు జన్మించింది. విశాఖపట్నంలో పెరిగిన శోభితా.. ఆ తర్వాత హెచ్‌ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ముంబై వెళ్లింది. అక్కడ కార్పొరేట్ లా చదివిన శోభితా.. వార్షిక నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్‌గా గెలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో విక్కీ కౌశల్ సరసన స్మృతికా నాయుడు పాత్రలో నటించింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన శోభితా.. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో నటించింది.
యంగ్ హీరో అడివి శేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో కనిపించింది. 2019లో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇదే కాకుండా బార్డ్ ఆఫ్ బ్లడ్, మూథోన్, ది బాడీ, ఘోస్ట్ స్టోరీస్, కురుప్, ది నైట్ చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ షాదీస్ నివేదిక ప్రకారం ఇప్పటివరకు శోభితా రూ.7 నుంచి రూ.10 కోట్లు సంపాదించినట్లు సమాచారం. అలాగే ఒక్కో సినిమాకు దాదాపు రూ.70 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.