సినీ నేపథ్య కుటుంబం కావడంతో ఇండస్ట్రీలోకి త్వరగానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమానే ఏకంగా దర్శక కేంద్రుడి రాఘవేంద్రరావు పర్యవేక్షణలో. రిలీజ్ కు ముందే పాటలు సూపర్ హిట్స్. కానీ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స రాలేదు. ఆ తర్వాత పలు డిఫరెంట్ సినిమాల్లో హీరోగా నటించాడు. మంచి నటుడున్న పేరొచ్చిందే కానీ నిర్మాతలకు మాత్రం కాసులు రాలేదు. దీంతో సినిమాలకు విరామం ఇచ్చేశాడు. తన ఓవరాల్ కెరీర్ లో మహా అంటే ఐదు సినిమాలు చేసిన ఈ హీరో ఆస్తులు మాత్రం బాగానే కూడా కూడా బెట్టాడని తెలుస్తోంది. వ్యాపారాలు, ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ స్టార్ హీరోలకు మించి సంపాదిస్తున్నట్లు సమాచారం. అతనే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ రాజా.
తండ్రి బ్రహ్మానందం అండుగు జాడల్లోనే నడుస్తూ గౌతమ్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2004లో పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది. ఆ తర్వాత వారెవా (2011), బసంతి (2014), చారుశీల (2016), మను (2018) లాంటి చిత్రాలతో నటుడిగా గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ సినిమాలేవీ కమర్షియల్ గా హిట్స్ కాలేదు. దీంతో వ్యాపారంపై దృష్టి సారించారు గౌతమ్.
ప్రస్తుతం గౌతమ్ కు హైదరాబాద్‌లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు భారీ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా బెంగుళూర్‌లో పదుల సంఖ్యలో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయట. ఇక వీటన్నింటిపై వచ్చే ఆదాయాన్ని ఐటీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారంట. ఇలా వీటి ద్వారానే గౌతమ్ నెలకు రూ.30 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడట. అంటే సంవత్సరానికి రూ.360 కోట్లకు పైగా సంపాదిస్తుడన్నమాట. మొత్తానికి స్టార్ హీరోలకు మించి ఆదాయాన్ని ఆర్జిస్తోన్న గౌతమ్ భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. కాగా గౌతమ్ ఈ మధ్యనే మరో సినిమాను అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో తన తండ్రి బ్రహ్మానందం కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.