AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Getup Srinu: సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా.. జబర్దస్త్ గెటప్ శ్రీను రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శీను ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ ఏడాది శీను ఇప్పటికే 8 సినిమాల్లో నటించాడంటే అతని క్రేజ్, డిమాండ్ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి టీవీ షోస్, సినిమాలతో బిజీ బిజీగా ఉండే శీను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు?

Jabardasth Getup Srinu: సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా.. జబర్దస్త్ గెటప్ శ్రీను రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Jabardasth Getup Srinu
Basha Shek
|

Updated on: Sep 17, 2026 | 11:55 AM

Share

‘జబర్దస్త్’ ద్వారా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న వారిలో గెటప్ శ్రీను ఒకడు. పేరుకు తగ్గట్టుగానే తన గెటప్పులతోనే ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు శీను. సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లతో కలిసి ఇతను చేసిన కామెడీ స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్వా నవ్వించాయి. యూట్యూబ్ లోనూ వీరి కామెడీ స్కిట్స్ కు భారీగా వ్యూస్ వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మంది గెటప్ శీను గెటప్పుల కోసమే ‘జబర్దస్త్’ ని చూసే వారంటే అతి శయోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలు సైతం గెటప్ శీను కామెడీకి ఫిదా అయ్యారంటేనే అర్థం చేసుకోవచ్చు అతనికి ఉన్న ట్యాలెంట్ ఏంటో. కాగా సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కు దూరమైపోయాడు గెటప్ శీను. అయితే అప్పుడప్పుడు గెస్టుగా వచ్చి ఆడియెన్స్ ను నవ్విస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న కమెడియన్లలో గెటప్ శ్రీను కూడా ఒకడు. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోవైపు అఖిల్ అక్కినేని వంటి యంగ్ హీరోలతోనూ కామెడీ చేస్తున్నాడీ జబర్దస్త్ కమెడియన్. ఈ ఒక్క ఏడాది లోనే దాదాపు 8 సినిమాల్లో నటించాడంటే గెటప్ శ్రీనుకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, రాకాస, రీసెంట్ గా లెనిన్ సినిమాల్లో గెటప్ శ్రీను నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్ తో బిజీ బిజీగా ఉంటోన్న గెటప్ శ్రీను రెమ్యునరేషన్ ఎంతన్నది ఆసక్తికరంగా మారింది. తన క్రేజ్, డిమాండ్ కు తగ్గట్టుగానే ఈ జబర్దస్త్ కమెడియన్ కూడా రెమ్యునరేషన్ అడుగుతున్నాడట. ఇక దర్శక నిర్మాతలు కూడా గెటప్ శ్రీను క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని అతను కోరినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ తన పాత్ర ప్రాధన్యాన్ని బట్టి సినిమాకు కనీసం రూ. 40 లక్షల నుంచి 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. కొన్ని సినిమాలకు ఇంతకు మించిన పారితోషికమే తీసుకుంటున్నాడని టాక్. ప్రస్తుతం ఏడాది పొడవునా సినిమాలు చేస్తున్నాడు గెటప్ శ్రీను. ఈ లెక్కన ఈ జబర్దస్త్ కమెడియన్ కు ఒక ఏడాదికి కోట్లలోనే ఆదాయం వస్తోందన్నమాట.

ఇవి కూడా చదవండి

భార్య, కుమారుడితో జబర్దస్త్ గెటప్ శ్రీను..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us