ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు గుర్తుపట్టలేనంత మారిపోయిందిగా..

|

Apr 26, 2024 | 5:35 PM

పైన పేర్కొన్న ఫోటోలోని బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? కాలేజీ రోజుల్లో అమాయకంగా కనిపిస్తూ.. డీగ్లామరస్‌గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ డాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. రెండు సినిమాలు చేసిందో..? లేదో..? కుర్రాళ్లకు అందాల దేవతగా మారిపోయింది. పది సినిమాలకు రావాల్సిన ఫ్యాన్ ఫాలోయింగ్..

ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు గుర్తుపట్టలేనంత మారిపోయిందిగా..
Viral Photo
Follow us on

పైన పేర్కొన్న ఫోటోలోని బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? కాలేజీ రోజుల్లో అమాయకంగా కనిపిస్తూ.. డీగ్లామరస్‌గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ డాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. రెండు సినిమాలు చేసిందో..? లేదో..? కుర్రాళ్లకు అందాల దేవతగా మారిపోయింది. పది సినిమాలకు రావాల్సిన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఈమెకు కేవలం ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. ఈ అమ్మడి ఫస్ట్ సినిమా చూసిన తర్వాత.. ఆమె మరో సాయి పల్లవి అని మీరు చెప్పకమానరు. ఇంతకీ ఆమె మరెవరో కాదు కుర్రాళ్ల క్రష్, తమిళ నటి దివ్యభారతి. ‘బ్యాచిలర్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మొదటి చిత్రంలోనే బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరో.

1992వ సంవత్సరం, జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది దివ్యభారతి. ‘బ్యాచిలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘జర్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించి అలరించింది. ఇక ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో కలిపి ఏకంగా ఐదు సినిమాలు లైన్‌లో పెట్టింది. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T -Greatest Of All Time’ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా తెలుగు తెరపైకి అరంగేట్రం చేస్తోంది. ‘కింగ్‌స్టన్’, ‘ఆసై’, ‘మహారాజా’ చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉండగా.. ఈ సినిమాలన్నీ కూడా అతిత్వరలోనే ప్రేక్షకుల ముందు రానున్నాయి.