
డైనమిక్ డైరెక్టర్ పూరీ తనయుడు ఆకాష్ నటించిన మెహబూబాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నేహా శెట్టి.

ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. కానీ ఈ అమ్మడి గ్లామర్ కు, నటనకు మంచి మార్కులు పడ్డాయి.

చాలా గ్యాప్ తర్వాత గల్లీ రౌడీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా కూడా ఆకట్టుకోలేదు

ఆతర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ వెంటనే అనూహ్యంగా డీజే టిల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

డీజే టిల్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో రాధిక పాత్రలో నేహా శెట్టి ఆకట్టుకుంది.

హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న నేహా శెట్టి సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీటు పుట్టిస్తుంది .