
సుడిగాలి సుధీర్ హీరోగానూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. అటు కమెడియన్ గా, యాంకర్ గా బిజీగా ఉన్న సుధీర్.. ఇటు సినిమాల్లోనూ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రెండున్నరేళ్ల కిందటే ప్రారంభమైన ఈ సినిమా.. ఇంకా అడియన్స్ ముందుకు రాలేదు. చాలా కాలంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రావడం లేదు. ఇందులో సుధీర్ సరసన తమిళ్ బ్యూటీ దివ్య భారతి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్స్ వైరలవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా హీరోయిన్, డైరెక్టర్ మధ్య ఓ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమా నుంచి ఓడియమ్మ్ అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ గురించి డైరెక్టర్ నరేష్ కుప్పిలి ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై హీరోయిన్ దివ్య భారతి అసహనం వ్యక్తం చేసింది. “ఇది ఏమి లేబర్ రా నువ్వు. ఎడిట్ లో తీసి పడేసిన షాట్స్ తో నెక్ట్స్ సినిమా అంతా గడిపేలా ఉన్నావ్.. ? అసలు సెకండ్ హీరోయిన్ చేయాల్సింది. ఈ చిలకతో వదిలావ్. మంచి ట్యూన్ ఏమి చేశావ్ రా.. ? స్టెప్పమ్ కొట్టి డప్పమ్ వేయనా… ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండు పై పెట్టుకుని..” అంటూ ట్వీట్ చేశారు నరేష్ కొప్పిలి. ఆయన ట్వీట్ పై స్పందిస్తూ.. సంచలన కామెంట్స్ చేసింది దివ్య భారతి.
“స్త్రీలను చిలకా అని పిలవడం ఏమీ జోక్ కాదు. ఇది లోతుగా పాతుకుపోయిన స్త్రీ ద్వేషాన్ని తెలియజేస్తుంది. ఇదేమి మొదటిసారి జరిగిన సంఘటన కాదు. ఈ డైరెక్టర్ సెట్ లోనూ అదే విధంగా మాట్లాడేవాడు. పదే పదే మహిళలను అగౌరవపరుస్తూ తాను క్రియేట్ చేస్తున్నానని చెప్పుకునే కళకే ద్రోహం చేశాడు. ఈ విషయంలో హీరో మౌనంగా ఉండడం చూసి నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఈ సంస్కృతికి కొనసాగించానికి నేను అనుమతిస్తున్నాను. మహిళలను ఎగతాళి చేయకుండా గౌరవించే వర్క్ ప్లేస్ నే నేను ఎంచుకుంటాను. ఇది కేవలం ఎంపిక కాదు.. కళాకారిణిగా.. ఒక మహిళగా నా ప్రమాణం” అంటూ రియాక్ట్ అయ్యింది.
Calling women “Chilaka” or any other term isn’t a harmless joke, it’s a reflection of deep-rooted misogyny. And this wasn’t a one-off incident; this director followed the same pattern on set too, repeatedly disrespecting women and honestly, betraying the very art he claims to… pic.twitter.com/7mNGpcxeG0
— Divyabharathi (@divyabarti2801) November 19, 2025
అలాగే తాను తమిళంలో ఓకే టీంతో ఎక్కువ సార్లు పనిచేశానని.. అక్కడ వారితో ఎలాంటి విభేదాలు లేవని.. కానీ ఈ ఒక్క దర్శకుడు మాత్రమే హద్దులు దాటి కించపరిచే వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడింది. పబ్లిక్ గా తనను ఒక మాట అన్నాడు కాబట్టి. రియాక్ట్ అయ్యే హక్కు నాకు ఉంది. ఇప్పటికీ మీరు అలాంటి ప్రవర్తనను సమర్థించుకోవాలనుకుంటే అది మీ ఇష్టం .. నేను పట్టించుకోను.. నా గురించి చెడు మాట్లాడాలని అనుకుంటే.. వారికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అంటూ మరో ట్వీట్ చేసింది.
For those claiming I ‘always have issues’ with teams, facts matter.
I’ve worked repeatedly with the same team, actors and crews in Tamil cinema with zero conflicts.
Only this one director crossed lines and made disrespectful comments.
He chose to make it public, and I have every…— Divyabharathi (@divyabarti2801) November 19, 2025
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..