AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Raju: డ‌ర్టీ పిక్చ‌ర్ డైరెక్ట‌ర్ నుంచి మ‌రో రొమాంటిక్ కామెడీ చిత్రం.. త‌న‌యుడు నిర్మాత‌, తండ్రి ద‌ర్శ‌క‌త్వం..

MS Raju New Movie: మ‌న‌సంతా నువ్వు, ఒక్క‌డు, వ‌ర్షం, వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత ఎంఎస్ రాజు. హీరోల‌కు స‌మాన‌మైన...

MS Raju: డ‌ర్టీ పిక్చ‌ర్ డైరెక్ట‌ర్ నుంచి మ‌రో రొమాంటిక్ కామెడీ చిత్రం.. త‌న‌యుడు నిర్మాత‌, తండ్రి ద‌ర్శ‌క‌త్వం..
Ms Raju
Narender Vaitla
|

Updated on: May 10, 2021 | 9:17 PM

Share

MS Raju New Movie: మ‌న‌సంతా నువ్వు, ఒక్క‌డు, వ‌ర్షం, వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత ఎంఎస్ రాజు. హీరోల‌కు స‌మాన‌మైన క్రేజ్‌తో ఇండ‌స్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు రాజు. ఇక ఇటీవ‌లి కాలంలో ఎంఎస్ నిర్మాణంలో సినిమాలు కాస్త త‌గ్గిన‌ట్లు క‌నిపించాయి. అయితే త‌న‌లోని మరో కోణాన్ని బ‌య‌ట పెడుతూ ఎంఎస్ రాజు ద‌ర్శ‌కుడిగా మారారు. గ‌తేడాది వ‌చ్చిన డ‌ర్టీహ‌రి చిత్రానికి ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తొలుత ఆహా ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం త‌ర్వాత థియేట‌ర్ల‌లోనూ విడ‌ద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే డ‌ర్టీ హ‌రి ఇచ్చిన స‌క్సెస్‌తో ఎంఎస్ రాజు మ‌రో సినిమాకు శ్రీకారం చుట్టారు. 7 డేస్ 6 నైట్స్ పేరుతో ఓ సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డారు. ఇక ఈ సినిమాను ఎంఎస్ రాజు త‌న‌యుడు సుమంత్ నిర్మిస్తుండ‌డం విశేషం. సుమంత్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వైల్డ్ హ‌నీ ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై నిర్మించ‌నున్నారు. తాజాగా ఎంఎస్ రాజు పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా ప్రీలుక్‌ను విడ‌దుల చేశారు. ఈ సినిమాకు సంబంధించి న‌టీ, న‌టుల వివరాలు తెలియాల్సి ఉంది. కొంద‌రు వ్య‌క్తులు విహార యాత్ర‌కు వెళ్లిన‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ను జూన్ 7న చేప‌ట్టాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Also Read: NTR Chandra Babu: ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డ‌డంపై స్పందించిన చంద్ర‌బాబు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా..

Alia Ranbir: బీటౌన్‌లో హాట్ న్యూస్‌.. అలియా, రణబీర్‌ బ్రేకప్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

Bigg Boss Kannada 8: కన్నడ బిగ్‌ బాస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి అవాంతరాలు.. తాజాగా షో క్యాన్సిల్