ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. ఎంతో ఎత్తుకు ఎదుగుతారు.. టాలీవుడ్ లో టాప్ హీరో అవుతాడు అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత మరోసారి తేజ దర్శకత్వంలో నువ్వు నేను అనే సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నువ్వు నేను సినిమా అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత వరుసగా లవ్ స్టోరీలను చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఉదయ్. ఇక మనసంతా నువ్వే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ కూడా క్లాసిక్ హిట్ గా నిలిచింది.
ఇక ఉదయ్ కిరణ్ కు మెల్లగా ఆఫర్స్ తగ్గడం మొదలయ్యాయి. ఆతర్వాత ఉదయ్ పెళ్లి చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ ఆ కొంతకాలానికే ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం మాత్రం ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు. ఉదయ్ అకాల మరణం ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇప్పటికి ఆయనను గుర్తుచేసుకుంటూనే ఉంటారు అభిమానులు. అయితే ఉదయ్ మరణం పై ఆసక్తికర కామెంట్స్ చేశారు దర్శకుడు వీఎన్ ఆదిత్య.
వీఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. మొన్నామధ్య ఆయన మాట్లాడుతూ.. ఉదయ్ చాలా మంది మనిషి. చిన్న వయసులోనే భారీ సక్సెస్ లు చూసేసాడు.. కానీ ఆసక్సెస్ లను హ్యాండిల్ చేయలేకపోయాడు. వరుస హిట్స్ తర్వాత వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. వాటిని తీసుకోలేకపోయాడు. ఆతర్వాత ఇంకొన్ని ఇబ్బందులు రావడంతో అతను తట్టుకోలేకపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ కు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ముందు నుంచి ఉంది. నాకు తేజకి, ఆర్పీ పట్నాయక్ కి ముందే తెలుసు. మేమంతా మాట్లాడి అతన్ని దాని నుంచి బయటకు తీసుకురావాలని అనుకున్నాం.. కానీ అతను మా మాట వినలేదు. ఉదయ్ కిరణ్ మా మాట పట్టించుకోకుండా సూసైడ్ చేసుకున్నాడని అన్నారు వీఎన్ ఆదిత్య. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.