Virata Parvam: విరాటపర్వంలో అందమైన ప్రేమకథ చెబుతున్నాం.. డైరెక్టర్ వేణు ఉడుగుల ఆసక్తికర కామెంట్స్..

|

Jun 08, 2022 | 8:33 PM

నేను పుట్టి పెరిగిన వాతావరణం. చూసిన జీవితం. చదివిన పుస్తకాలు,.. నేను ఎలాంటి సినిమా తీయాలో అనే ఒక విజన్ ని ఇచ్చాయి.

Virata Parvam: విరాటపర్వంలో అందమైన ప్రేమకథ చెబుతున్నాం.. డైరెక్టర్ వేణు ఉడుగుల ఆసక్తికర కామెంట్స్..
Venu Udugula
Follow us on

టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం (Virata Parvam). డి సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నక్సల్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో రానా నక్సలైట్ రవన్నగా.. సాయి పల్లవి వెన్నెల పాత్రలలో కనిపించనున్నారు.  (Sai Pallavi)ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అంచనాలును మరింత పెంచేసింది. ఈ మూవీ విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో డైరెక్టర్ వేణు ఉడుగుల మీడియాతో ముచ్చటించారు.

వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “నేను పుట్టి పెరిగిన వాతావరణం. చూసిన జీవితం. చదివిన పుస్తకాలు,.. నేను ఎలాంటి సినిమా తీయాలో అనే ఒక విజన్ ని ఇచ్చాయి. నాకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో బాగంగా తీసిన సినిమానే విరాటపర్వం. బరువైన కథ చెప్పాలని గానీ క్లిష్టమైన కథ చెప్పాలని గానీ అనుకోను. నా టెంపర్మెంటే నా సినిమా. ఈ కథ చెప్పాలని అనుకున్నాను చెప్పాను తప్పితే ఇది బరువైనదా క్లిష్టమైనదా? అనే ఆలోచన లేదు ” అంటూ చెప్పుకొచ్చారు..

అలాగే.. లెఫ్ట్ ప్రభావం బాగా తగ్గిపోయింది. వాళ్ళ ఐడియాలజీ గురించి ఒక జనరేషన్ కి సరిగ్గా అవగాహన కూడా లేదు కదా.. ఇలాంటి సందర్భంలో ఈ కథని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎలా చెప్పగలని అనుకున్నారు ? అని అడగ్గా.. డైరెక్టర్ వేణు ఉడుగుల స్పందిస్తూ.. ” లెఫ్ట్, రైటు అనేది అప్రస్తుతం. నేపధ్యాన్ని పక్కన పెడితే.. కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం. ఒక దొంగల కుటుంబం వుంది. ఆ కుటుంబంలో ఒక ప్రేమకథ చెబితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నేపధ్యానికి సంబంధం లేదు. విరాటపర్వంలో ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. మానవ సంబంధాల నేపధ్యంలో చెప్పే కథలని ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. విరాటపర్వం ఒక అమ్మాయి ప్రేమకథ. నక్సల్ నేపధ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది. చాలా కొత్తగా ఉండబోతుంది.” అన్నారు.

ఇవి కూడా చదవండి