Virata Parvam: కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం: వేణు ఊడుగుల

|

Jun 09, 2022 | 12:40 PM

దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంట తెరకెక్కిన సినిమా విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు.

Virata Parvam: కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం: వేణు ఊడుగుల
Venu Udugula
Follow us on

దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంట తెరకెక్కిన సినిమా విరాట పర్వం(Virata Parvam). వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలని పెంచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను దర్శకుడు వేణు మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘విరాట‌ప‌ర్వం, వెన్నెల పాత్రలకు ప్రేరణ ఉంది. యదార్ధ సంఘటనలు ఆధారంగానే ఈ చిత్రాన్ని తీశాం. సరళ అనే ఒక అమ్మాయి జీవితం మా విరాట పర్వం సినిమా అన్నారు. నేపధ్యాన్ని పక్కన పెడితే.. కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం. విరాటపర్వంలో ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

మానవ సంబంధాల నేపథ్యంలో చెప్పే కథలని ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. విరాటపర్వం ఒక అమ్మాయి ప్రేమకథ. నక్సల్ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది. చాలా కొత్తగా ఉండబోతుంది. గ్రేట్ స్టార్ కాస్ట్, మంచి నిర్మాతలు వలన విరాటపర్వం సినిమా మొదలైనప్పటి నుండి సినిమాపై చాలా పాజిటివ్ బజ్ వుంది. ఇక కరోనా సమయంలో అందరిదీ ఒకటే పరిస్థితి. ఈ సమయంలో రెండు కథలు రాసుకున్నా. ఐతే సినిమా త్వరగా వస్తే బావుంటుదని అనిపించేది. అన్నీ అధికగమించి చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. విప్లవం అనేది ప్రేమైక చర్య. ఈ మాటని విసృతతంగా అర్ధం చేసుకోవాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వుండేదే కాదు.. ఒక సమూహానికి వ్యక్తి మధ్య వుండే ప్రేమ. ఎంత ప్రేమ వుంటే ఒక సమూహంలోకి వెళ్లాలని అనుకుంటారు ?జనం కోసం పని చేయాలంటే ఎంతో ప్రేమ వుంటే తప్ప త్యాగం చేయలేం అన్నారు.

ఇవి కూడా చదవండి

రానా గారు ఈ కథ ఒప్పుకోవడం నా గొప్పదనం కాదు రానాగారి గొప్పదనం. నేను సురేష్ బాబు గారికి ఈ కథ చెప్పాను. సురేష్ బాబు గారు ‘రానాకి లైన్ నచ్చింది చెప్తావా’ అన్నారు. రానా గారికి చెప్పాను. కథ విన్న తర్వాత రానా గారు చేస్తా అన్నారు. ఈ కథ రానా గారు ఎందుకు చేస్తానన్నారో కాసేపు అర్ధం కాలేదు. ఒక కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో వచ్చాడు. ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తారనే గొప్ప మనసుతో రానా గారు ఈ సినిమాని చేశారు. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకులు డిఫరెంట్ కంటెంట్ చూస్తున్నారు. ప్రేక్షకుల్లో ఫిల్మ్ లిటరసీ బాగా పెరిగింది. ఒక ఆర్ట్ సినిమా తీసి కమర్షియల్ సినిమా అంటే నమ్మే పరిస్థితి లేదు. జనాలకు మంచి కంటెంట్ ఇవ్వాలంటే చాలా చర్చలు, మార్పులు జరగడం తప్పులేదు అన్నారు దర్శకుడు వేణు ఊడుగుల.