Ravi Teja: మాస్ మహారాజ‌ కోసం పాట రాసిన త్రివిక్రమ్.. ఏ సినిమా కోసమంటే

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఆయన సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. లైఫ్ లెసన్‌లా త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.

Ravi Teja: మాస్ మహారాజ‌ కోసం పాట రాసిన త్రివిక్రమ్.. ఏ సినిమా కోసమంటే
Trivikram , Raviteja

Updated on: Mar 20, 2024 | 1:03 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా రచయిత పని చేసిన విషయం చాలా మందికి తెలుసు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పని చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు దర్శకుడిగా దూసుకుపోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఆయన సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. లైఫ్ లెసన్‌లా త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. అందుకే ఆయనను గురూజీ అని అంటుంటారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమా చేశారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. గుంటూరు కారం సినిమాకు ముందుగా మిక్డ్ టాక్ వచ్చింది. ఆతర్వాత హిట్ టాక్ వచ్చింది.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమా కథలు, డైలాగ్స్ , దర్శకత్వం మాత్రమే కాదు సాంగ్స్ కూడా రాస్తారు. మాస్ మహారాజ రవితేజ కోసం గురూజీ ఓ అద్భుతమైన పాటను రాసారని మీకు తెలుసా..? రవితేజ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేయలేదు. మరి రవితేజకు త్రివిక్రమ్ పాట ఎప్పుడు రాశారు అని అనుకుంటున్నారా.. అదే ఇక్కడ విశేషం..

రవితేజ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇడియట్ సినిమా కంటే ముందు పలుఎం లవ్ స్టోరీ సినిమాల్లో ఆయన నటించారు. వాటిలో ఒక రాజు.. ఒక రాణి సినిమా ఒకటి. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో స్వరాల వీణ ఈ వేళలోన నీకేమయిందే ఆకాశమా.. అంటూ సాగే అందమైన పాటను త్రివిక్రమ్ రచించారు. ఈ పాటకు దివంగత మసంగీత దర్శకుడు చక్రి సంగీతం అందించడంతో పాటు పాడారు కూడా.. ఈ విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు.. ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఈగల్ సినిమాతో హిట్ అందుకున్న రవితేజ. తన నెక్స్ట్ సినిమాకోసం రెడీ అవుతున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రవితేజ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.