మీనాక్షి కళ్యాణం.. త్రివిక్రమ్ భార్య సౌజన్య నాట్య ప్రదర్శన.. అతిథిగా పవన్ కళ్యాణ్..  లైవ్..

టాలీవుడ్ డైరెక్టర్ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న టాప్

మీనాక్షి కళ్యాణం.. త్రివిక్రమ్ భార్య సౌజన్య నాట్య ప్రదర్శన.. అతిథిగా పవన్ కళ్యాణ్..  లైవ్..
Trivikram

Updated on: Dec 17, 2021 | 7:31 PM

టాలీవుడ్ డైరెక్టర్ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్స్‏లలో త్రివిక్రమ్ ఒకరు. అయితే త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నాట్య కళాకారణి అన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. నాట్య కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సౌజన్య. ఇప్పటికే పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చిన సౌజన్య తాజాగా మీనాక్షి కళ్యాణం అనే శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‏లోని శిల్పకళా వేదికలో మీనాక్షి కళ్యాణం నృత్య రూపక ప్రదర్శన ప్రారంభమైంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని టీవీ9 తెలుగులో ప్రత్యేక్షంగా వీక్షించవచ్చు.

అయితే  ఈ నృత్య ప్రదర్శన డిసెంబర్ 2వ తేదీనే జరగాల్సి ఉంది. అయితే సౌజన్య బాబాయ్ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మాత్తుగా మరణించడంతో ఈ నాట్య ప్రదర్శన వాయిదా పడింది.

లైవ్..

Also Read: Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..

Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..

Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్

Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!