Trivikram Wife: కమనీయంగా సాగిన మీనాక్షి కళ్యాణం ప్రదర్శన.. తన జీవితంలో ఇద్దరు ముఖ్య వ్యక్తుల గురించి చెప్పిన త్రివిక్రమ్..

Trivikram Wife: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ మంచి క్లాసికల్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే.. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో...

Trivikram Wife: కమనీయంగా సాగిన మీనాక్షి కళ్యాణం ప్రదర్శన.. తన జీవితంలో ఇద్దరు ముఖ్య వ్యక్తుల గురించి చెప్పిన త్రివిక్రమ్..
Soujanya Trivikram

Updated on: Dec 18, 2021 | 7:50 AM

Trivikram Wife: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ మంచి క్లాసికల్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే.. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సౌజన్య ‘మీనాక్షి కళ్యాణం’ అనే  శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఇటీవల అకస్మాత్తుగా మరణించిన ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరించుకుంటూ నివాళులర్పించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. శివుడు రెండో అవతారం సుందరేశన్.. ఈ అవతారంలో జరిగిన పెళ్లి మీనాక్షి కళ్యాణం అని చెప్పారు. విరూపంలోని స్వరూపాన్ని మనం చూడగలిగితే అంతా కళ్యాణమే అని చెప్పారు. కూచిపూడి నాట్యకారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా తనకు ఇదొక అద్భుతమైన సాయంత్రమని చెప్పారు. తనకు జీవితంలో ఇష్టమైన వారిలో ఇద్దరు.. ఒకరు స్టేజ్ మీద ప్రదర్శన ఇస్తే.. మరొకరు.. నా పక్కన కూర్చుని.. నాట్య ప్రదర్శనని తన్మయత్వంతో చూశారంటూ.. భార్య సౌజన్య, ప్రాణ స్నేహితుడుడైన పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు. ఇంతమైన సాయంత్రాన్ని ఇచ్చిన కూచిపూడి బృందానికి థాంక్స్ చెప్పారు.

సౌజన్య నాట్య ప్రదర్శన కూచిపూడి వారసులు పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలసి ఈ ఈవెంట్‌ను అందించాయి.  సౌజన్య క్లాసికల్ డ్యాన్సర్ గా దైవిక భంగిమలో ఎంతో  మనోహరంగా కనిపించారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి, వసంత లక్ష్మీ నరసింహాచారి, త్రివిక్రమ్ శ్రీనివాస్, చుక్కపల్లి సురేష్, సతీష్ చంద్ర గుప్తా   ఇతర ప్రముఖులతో పాటు పలువురు కళాభిమానులు కూడా హాజరయ్యారు.

 

Also Read:   అమ్మప్రేమను చాటి చెప్పే వీడియో.. తన బిడ్డకు పాలు ఇస్తూ.. కోతి మురిపెంకు నెటిజన్లు ఫిదా..