Vettaiyan: వెట్టయన్‌కు ప్రీక్వెల్‌ చేయాలని ఉంది.. ఆసక్తికర విషయం చెప్పిన డైరెక్టర్

|

Oct 17, 2024 | 4:21 PM

వెట్టయన్'కి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం చూస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాలో నేను లేవనెత్తిన అంశాల గురించి చర్చలు జరుగుతాయని నేను భావిస్తున్నాను అని దర్శకుడూ

Vettaiyan: వెట్టయన్‌కు ప్రీక్వెల్‌ చేయాలని ఉంది.. ఆసక్తికర విషయం చెప్పిన డైరెక్టర్
Vettaiyan
Follow us on

దసరా సందర్భంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘వెట్టయన్ ది హంటర్’ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయ్యన్ ది హంటర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా నటించిన ఈ చిత్రం థియేటర్లలో దుమ్ములేపేస్తోంది. ఈ మూవీకి ఇంత ఆదరణ దక్కడం, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకుంటూ చిత్రానికి సంబంధించిన విషయాలెన్నో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

రజనీకాంత్ అభిమానులను అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాను రూపొందించడమే నా మెయిన్ టార్గెట్. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. ఆయన అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్ అని జ్ఞానవేల్ అన్నారు. రజినీకాంత్‌ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అని  అన్నారు జ్ఞానవేల్.

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

అలాగే ఇద్దరు సూపర్‌స్టార్‌లను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించడం కంటే.. నేను వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టాను. అమితాబ్ బచ్చన్ పాత్రను మొదట పరిచయం చేశాను. ఆ పాత్ర తాలుకా వ్యక్తిత్వాన్ని చూపెట్టాను. అయితే రజనీకాంత్ పాత్ర మరింత తటస్థ వైఖరితో ప్రారంభం అవుతుంది. వారిద్దరి మధ్య ఉండే భావజాలాల ఘర్షణ ద్వితీయార్ధంలో ఆసక్తికరమైన కథనంగా మారింది.దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్‌కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని చూపించాను.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

అదేవిధంగా ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్‌కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్‌కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఈ చిత్రం స్పృశిస్తుంది అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గురించి మాట్లాడుతూ.. అనిరుధ్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు. అదేవిధంగా వెట్టయన్’కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను ప్రీక్వెల్‌ను చేయడానికి ఎక్కువ ఆసక్తితో ఉన్నాను. ‘వెట్టయన్: ది హంటర్’ అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను అని టి.జె.జ్ఞానవేల్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.