Director Surya Kiran: అన్నయ్యా.. మరో జన్మలోనైనా నీ కలలన్నీ నిజమవ్వాలి.. డైరెక్టర్ సూర్యకిరణ్ చెల్లెలు సుజిత ఎమోషనల్ పోస్ట్..

|

Mar 15, 2024 | 4:22 PM

తాజాగా ఆయన మృతిపై సోదరి సుజిత ధనుష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అన్నయ్యతో కలిసి ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. "అన్నయ్యా.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నీ మాటలు.. టాలెంట్ గురించి ఎప్పుడూ గర్వపడుతుంటాను. మరో జన్మ ఉంటే నువ్వు కన్న కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను" అంటూ అతడితో ఉన్న పాత ఫోటోను షేర్ చేశారు. సూర్య కిరణ్ చెల్లెలు సుజిత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాలు, సీరియల్స్ చేశారు.

Director Surya Kiran: అన్నయ్యా.. మరో జన్మలోనైనా నీ కలలన్నీ నిజమవ్వాలి.. డైరెక్టర్ సూర్యకిరణ్ చెల్లెలు సుజిత ఎమోషనల్ పోస్ట్..
Sujitha, Surya Kiran
Follow us on

ప్రముఖ డైరెక్టర్ సూర్య కిరణ్ గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 48 ఏళ్ల వయసున్న అతడి కొద్ది రోజులుగా కామెర్ల సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మార్చి 11న ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. సూర్య కిరణ్ అకాల మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మృతిపై సోదరి సుజిత ధనుష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అన్నయ్యతో కలిసి ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. “అన్నయ్యా.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నీ మాటలు.. టాలెంట్ గురించి ఎప్పుడూ గర్వపడుతుంటాను. మరో జన్మ ఉంటే నువ్వు కన్న కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను” అంటూ అతడితో ఉన్న పాత ఫోటోను షేర్ చేశారు. సూర్య కిరణ్ చెల్లెలు సుజిత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాలు, సీరియల్స్ చేశారు.

బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. తెలుగు, తమిళ్ సినిమాల్లో దాదాపు 200పైగా సినిమాల్లో నటించారు. సుమంత్ నటించిన సత్యం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ధన, బ్రహ్మాస్త్రం, రాజూ భాయ్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. తమిళం, మలయాళం భాషలలోనూ పలు చిత్రాలను రూపొందించి సక్సెస్ అందుకున్నారు. సీనియర్ హీరోయిన్ కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు సూర్య కిరణ్. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత ఒంటరిగానే ఉన్నారు సూర్య కిరణ్. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సూర్య కిరణ్ ఆ తర్వాత 2020లో బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. దర్శకుడిగా వరుస ఫెయిల్యూర్స్ రావడం… ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరం కావడంతో సూర్య కిరణ్ మానసిక ఒత్తిడికి గురయ్యారని.. ఆ బాధతోనే మదనపడుతుండేవాడని.. దీంతో ఆరోగ్యం దెబ్బతిందని సన్నిహితులు చెబుతున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన మార్చి 11న తుదిశ్వాస విడిచారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.