Sukumar: సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు.. ఇంటర్నేషనల్ స్టేజ్ పై అదరగొట్టిన సుకృతి..

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ దర్శకులలో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్న సుక్కు.. ఇటీవల పుష్ప మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. పుష్ప 1, 2 చిత్రాలతో రికార్డ్స్ బ్రేక్ చేసిన సుకుమార్.. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

Sukumar: సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు.. ఇంటర్నేషనల్ స్టేజ్ పై అదరగొట్టిన సుకృతి..
Sukumar Daughter

Updated on: Mar 17, 2026 | 11:38 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 1 , 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోయే ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. సుకుమార్ తనయ సుకృతి సైతం తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదివరకే గాంధీ తాత చెట్టు సినిమాలో నటించి బాలనటిగా అందరి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఈ చిత్రానికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డ్ అందుకుంది. చిన్న వయసులోనే తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్న సుకృతి ఇప్పుడు గాయనిగా అందర్నీ మెప్పిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

తాజాగా సుకృతి సౌత్ కొరియాలో ఓ కాన్సర్ట్ లో మెయిన్ సింగర్ గా పెర్ఫార్మ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సౌత్ కొరియాలో జరిగిన ఓ కాన్సర్ట్ లో ఇంగ్లీష్ సాంగ్ తో హాలీవుడ్ స్టైల్ సింగింగ్ తో సుకృతి అదరగొట్టింది. సుకృతి పాడిన వీడియోను డైరెక్టర్ సుకుమార్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కూతురిపై ప్రశంసలు కురిపించారు. సుకృతిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ రాసుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

“చాలా గర్వంగా ఉంది.. సుకృతి సౌత్ కొరియా జేజులో ఉన్న AMISలో పెర్ఫార్మ్ చేసింది. తన డెడికేషన్, ప్రాక్టీస్, ప్రేమ ఇవన్నీ తమ ఇంటర్నేషనల్ స్టేజ్ కు చేరుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఒక తండ్రిగా ఎంతో సంతోషిస్తున్నాను ” అంటూ రాసుకొచ్చారు సుకుమార్.ఆ వీడియో సుకృతి పాడడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ సింగర్స్ పాడినంత సులభంగా. ఎంతో అందంగా పాడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us