AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 The Rule: “పుష్ప 2” కోసం సుకుమార్ రూటు మార్చారా.. అందుకోసమే కథలో మార్పులు చేశారా..?

పుష్ప ది రూల్ సినిమా కోసం బన్నీ ఆర్మీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సంచలన విజయంతో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Pushpa 2 The Rule: పుష్ప 2 కోసం సుకుమార్ రూటు మార్చారా.. అందుకోసమే కథలో మార్పులు చేశారా..?
Puspa 2
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2022 | 12:22 PM

Share

పుష్ప ది రూల్(Pushpa 2 )సినిమా కోసం బన్నీ ఆర్మీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సంచలన విజయంతో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎట్టకేలకు పుష్ప ది రూల్ మొదలైంది.. మరి నిజంగానే బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ రూలింగ్ కూడా మొదలు కానుందా..? చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఈ సినిమాకు ఎట్టకేలకు ముహూర్తం పెట్టారు మేకర్స్. మరి మొదటి భాగంతో పోలిస్తే ఇందులో సుకుమార్ చేసిన మార్పులేంటి..? బన్నీ అలాగే కనిపిస్తారా లేదంటే లుక్‌లో మార్పులేమైనా ఉండబోతున్నాయా..? అసలు పుష్ప 2 షూటింగ్ ఎప్పట్నుంచి షురూ కానుంది..? నిజంగానే పుష్పతో ఇండియా మొత్తాన్ని తన అడ్డాగా మార్చేసుకున్నారు అల్లు అర్జున్. తెలుగు సినిమాగానే మొదలైన ఈ చిత్ర ప్రభంజనం.. ఆ తర్వాత ఖండాలు దాటిపోయింది. సుకుమార్ ఊహించిన దానికంటే పెద్ద హిట్టైంది పుష్ప. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో కరోనా కష్టాల్ని కూడా దాటి 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. దాంతో రెండో భాగంపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.

పుష్ప రేంజ్ చూశాక.. రెండో భాగంలో మరింత జాగ్రత్త పెంచారు డైరెక్టర్ సుకుమార్. నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని.. వాళ్ళకు తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేర్పులుచేశారట. అలాగే అల్లు అర్జున్ లుక్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్క్రిప్ట్ లాక్ అయ్యాక.. షూటింగ్స్ బంద్ కావడంతో పుష్ప 2 ఓపెనింగ్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు రీసెంట్ గా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. బన్నీ లేకుండానే పుష్ప 2 ఓపెనింగ్ జరిగింది. మొదటి భాగానికి కేవలం దర్శకుడిగా ఉన్న సుకుమార్.. రెండో పార్ట్‌కు నిర్మాతగా కూడా మారిపోయారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో.. వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు. ఈ సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు అల్లు అర్జున్. మరి పుష్ప ది రూల్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us
ఈశాన్యంలో నీటి చెంబు ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం అష్టైశ్వర్యాలకు
ఈశాన్యంలో నీటి చెంబు ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం అష్టైశ్వర్యాలకు
షూస్ కొనేటప్పుడు ఈ నంబర్లు గమనిస్తున్నారా? ఆ రేటింగ్‌ల వెనుక కథ?
షూస్ కొనేటప్పుడు ఈ నంబర్లు గమనిస్తున్నారా? ఆ రేటింగ్‌ల వెనుక కథ?
బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ..
బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ..
వీరి జీవితంలో ఇక పూల పాన్పులే.. శుక్రుడి అనుగ్రహంతో లక్కే లక్కు!
వీరి జీవితంలో ఇక పూల పాన్పులే.. శుక్రుడి అనుగ్రహంతో లక్కే లక్కు!
వాస్తు టిప్స్ : కూరల్లో వేసే కరివేపాకు,మీ అదృష్టాన్ని మార్చుతుంది
వాస్తు టిప్స్ : కూరల్లో వేసే కరివేపాకు,మీ అదృష్టాన్ని మార్చుతుంది
మంధాన, రిచా ఘోష్ డేంజరస్ బ్యాటింగ్.. పాక్ టార్గెట్ ఎంతంటే?
మంధాన, రిచా ఘోష్ డేంజరస్ బ్యాటింగ్.. పాక్ టార్గెట్ ఎంతంటే?
మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..
మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..
చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే
చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే