Director Sukumar: రాజోలులో రూ..40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌..

|

May 22, 2021 | 8:36 PM

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఆక్సిజన్‌ పడకలు దొరకక కరోనా బాధితులు పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు.

Director Sukumar: రాజోలులో రూ..40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌..
Sukumar
Follow us on

director sukumar: కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఆక్సిజన్‌ పడకలు దొరకక కరోనా బాధితులు పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. తన స్వస్థలమైనా కాకినాడ దగ్గర రాజోలు గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో డీఓసీఎస్‌ 80 ఆక్సిజన్‌ జనరేటర్‌ సిస్టమ్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కోనసీమలోని కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేట ర్లు అందించేందుకు ఆయన ఇప్పటికే ముందుకు వచ్చారు. రాజోలులో ప్లాంట్‌ నిర్మాణం తక్షణమే చేప ట్టి నాలుగురోజు ల్లోపూర్తిచేసేలా ఏర్పాటు చేస్తున్నారు. తొలుత రూ.25లక్షలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేట ర్లు అందించాలనుకున్న సుకుమార్‌ ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తే అవసరానికి తగిన ఆక్సిజన్‌ తయారుచేసుకోవచ్చన్న వుద్దేశంతో మరో రూ.15 లక్షలు జత చేసి మొత్తం రూ.40 లక్షలతోఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నారని సుకమార్‌ స్నేహితుడు అమలాపురం పంచాయతీరాజ్‌డీఈఈ అన్యం రాంబాబు తెలిపారు. సుకుమార్‌ సేవాగుణాన్ని టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు కోనసీమ ప్రజలు కూడా అభినందిస్తున్నారు.

అందులో భాగంగా ఇటీవల జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇక మొదటి విడతగా 40 లీటర్ల ఆక్సిజన్ సిలండర్లను అమలాపురంలో ఉన్న ఆజాద్ ఫౌండేషన్ కు తన స్నేహితుడు రాంబాబు ద్వారా సుకుమార్‌ ఇప్పించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu Fans: ఈ నెలాఖరులో ఘట్టమనేని ఫ్యాన్స్ పండుగ.. రికార్డులు బ్రేక్ చెయ్య‌డానికి వేయి క‌ళ్ల‌తో వెయిటింగ్

Natural star Nani: నాని శ్యామ్ సింగరాయ్ కు అనుకోని కష్టం.. సినిమా సెట్ ను నీటముంచిన తుఫాన్..

Singer Madhu Priya : సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ.. కారణం ఇదే..