SS Rajamouli: 11 ఏళ్ల చిన్నారి చేతులమీదుగా అవార్డ్ అందుకున్న జక్కన్న.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..

ఈ వేడుకలలో దర్శకుడు రాజమౌళికి 11 ఏళ్ల చిన్నారి అవార్డ్ అందించింది. తాజాగా ఆ అమ్మాయితో సెల్ఫీ తీసుకున్న జక్కన్న.. ఆ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. తనకు అవార్డ్ అందించిన చిన్నారితో ఫోటో తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు రాజమౌళి.

SS Rajamouli: 11 ఏళ్ల చిన్నారి చేతులమీదుగా అవార్డ్ అందుకున్న జక్కన్న.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..
Rajamouli

Updated on: Feb 26, 2023 | 12:11 PM

డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి విశ్వవేదికపై అరుదైన గౌరవం లభించింది. ఇప్పటివరకు అనేక అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులను అందుకుంది. గత ఐదు రోజులుగా అమెరికా పర్యటనలోనే ఉన్న జక్కన్న.. చరణ్ ఈ హెచ్ సీఏ అవార్డ్స్ అందుకున్నారు. బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ వేడుకలలో దర్శకుడు రాజమౌళికి 11 ఏళ్ల చిన్నారి అవార్డ్ అందించింది. తాజాగా ఆ అమ్మాయితో సెల్ఫీ తీసుకున్న జక్కన్న.. ఆ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. తనకు అవార్డ్ అందించిన చిన్నారితో ఫోటో తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు రాజమౌళి.

“అద్భుతమైన ప్రతిభావంతులైన 11 ఏళ్ల @violetmcgraw వేదికపై నాకు అవార్డ్ అందించినప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ తర్వాత ఆమె నన్ను సెల్ఫీ అడిగిన సమయంలో చాలా హ్యాప్పీగా ఉన్నాను” అంటూ రాసుకోచ్చారు జక్కన్న. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ వేదికపై రాజమౌళికి అవార్డ్ అందించిన ఆ అమ్మాయి పేరు వైలెట్ మెక్ గ్రా. ఆమె అమెరికన్ బాలనటి. చైల్డ్ ఆర్టిస్ అయిన వైలెట్ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె చివరిసారిగా 2022లో హారర్ చిత్రం M3GAN లో కేడీగా కనిపించింది. ఆమె ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్‌లో కూడా నటించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.