ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తమిళంలోనేకాకుండా తెలుగులోనూ పలు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఆయన దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. సెల్వరాఘవన్ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ‘తుళ్లువదో ఇలామై’తో దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ తొలి చిత్రంతోనే పెద్ద హిట్ కొట్టారు. తాజాగా ఆ సినిమాలోని ఫొటోను షేర్ చేసిన ఓ అభిమాని..’ఈ మువీ దర్శకుడు చనిపోయినట్లున్నారు. లేదంటే సినిమాలు తీయడం ఆపేసైనా ఉండాంటూ ట్వీట్ చేశారు. దీనికి సెల్వరాఘవన్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు.
‘వై మై ఫ్రెండ్? నేను చనిపోలేదు. సినిమా నుంచి రిటైర్ కూడా అవ్వలేదు. నేను కొంత సమయం నా కోసం గడుపుతున్నానంతే. నేను ఇంకా నలభైలలో మాత్రమే ఉన్నాను. ఐ యామ్ బ్యాక్’ అని తన అభిమానికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీంతో వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Why my friend ? I’m not dead or retired. I have just spent some time for myself. I’m just in my forties .. And I’m back. https://t.co/CYdLcoG97k
— selvaraghavan (@selvaraghavan) May 3, 2023
సెల్వరాఘవన్ చివరిసారిగా ధనుష్ ద్విపాత్రాభినయంలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మువీ ‘నానే వరువెన్’ తెరకెక్కించారు. పెద్ద హిట్ కొట్టింది. 2004 తమిళంలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7/G బృందావన్ కాలనీకి సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.