
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. కేవలం మూడంటే.. మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో.. తన మేకింగ్ పవర్ ఏంటో చూపించాడు. తనదైన మేకింగ్‌తో వీడు తోపురా సామి అని పేరు తెచ్చుకున్నాడు. తన తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం క్రియేట్ చేసిన.. సందీప్.. అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి.. అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ఆపై రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ తీసి.. ఇండియన్ సినిమా హిస్టరీలో తన ఇంపాక్ట్ ఏపాటిదో చూపించాడు. ఇక త్వరలో సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పిరిట్ సినిమా తెరకెక్కించనున్నాడు సందీప్. అయితే ఈ దర్శకుడి యాటిట్యూడ్ చాలా రూడ్‌గా ఉంటుంది అని బయట టాక్ ఉంది. మనోడు ఏ అభిప్రాయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. అందుకే ఆ పేరు వచ్చింది. తన సినిమాల్లోని పంచ్ డైలాగ్స్‌లానే సందీప్ మాటలు ఉంటాయి. అయినా ఇదంతా కాయిన్‌కు ఓ సైడ్ మాత్రమే.. మరో సైడ్ మనోడిలో ఎంతో హెల్పింగ్ నేచర్ ఉంది.
అవును.. నటి గాయత్రి గుప్తా మీకు తెలిసే ఉంటుంది. తను ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ రోల్ చేసింది. తను ఆ ఆటోఇమ్యూన్ డిసీజ్ బారిన పడింది. దానికి ట్రీట్మెంట్ కోసం ఆమె చాలా ఖర్చు పెట్టింది. చివరకి తన చికిత్స కోసం ఆమె వద్ద మనీ లేకుండా అయిపోయాయి. రెంట్ కూడా కట్టుకోడానికి డబ్బుల్లేని దీనస్థితిలోకి వెళ్లిపోయింది దీంతో ఆమె తనకు పూర్వం ఉన్న పరిచయంతో సాయం కావాలని సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ పెట్టిందట. తన పరిస్థితి ఇది అని వివరించిందట. దీంతో అతను రిపోర్ట్స్ పంపించమని కోరాడట. వాటిని చూసిన అనంతరం.. 3 నెలల చికిత్స కోసం మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అని సందీప్ తిరిగి మెసేజ్ పెట్టారట. దీంతో గాయత్రి గుప్త అన్ని వివరాలతో పీపీటీ తయారు చేసి పంపింది. ఆ తర్వాత ఒక వారం రోజుల్లోనే సందీప్ ఐదు లక్షల 50 వేలు పంపాడట. ఈ విషయాన్ని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించింది గాయత్రి గుప్తా. దీంతో సందీప్ రెడ్డి వంగాను నెటిజన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.