
తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవిబాబు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రవిబాబు తన కెరీర్‌లోని కొన్ని ఆసక్తికర విషయాలను, చేదు అనుభవాలను పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానిక నటుల కంటే ఇతర భాషల నటులకు ప్రాధాన్యత ఇవ్వడంపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మన నటులు అందుబాటులో ఉన్నా, బయటి నుండి నటులను తీసుకొచ్చి, వారికి తెలుగు డైలాగులు రాక కష్టపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు రవిబాబు. నితిన్ హీరోగా నటించిన విక్టరీ చిత్రంలో తనకు లాయర్ పాత్ర కోసం సురేష్ రెడ్డి అనే వ్యక్తి అడిగారని అప్పుడు జరిగిన ఓ సంఘటనను పంచుకున్నారు రవిబాబు.
నితిన్ హీరోగా, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మించిన విక్టరీ చిత్రంలో అశుతోష్ రాణా అనే హిందీ నటుడికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుసుకుని, రవిబాబు గట్టిగా ప్రశ్నించారట. నాకు తెలుగు వచ్చు, అశుతోష్ రాణాకి తెలుగు రాదు. నా ఇంట్లో నేను ఉంటాను, బిజినెస్ క్లాసులో ఢిల్లీ నుంచో, బాంబే నుంచో రాను. నాకు మేకప్ మేన్, అసిస్టెంట్ లేరు, నా కారు నేను వేసుకొని వస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో అతని కంటే 100 రెట్లు ఇమేజ్ నాదే ఎక్కువ అలాంటప్పుడు.. అయినప్పటికీ, తనకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారట. తన వాదనకు ఆ నిర్మాత దగ్గర సమాధానం లేదని, అతని కంటే చివరకు లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తేనే చేస్తానని చెప్పి, ఆ సినిమా చేశానని రవిబాబు గుర్తు చేసుకున్నారు.
ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నప్పుడు, ఇతర భాషల నుండి తక్కువ అర్హత కలిగిన నటులను ఎందుకు తీసుకువస్తున్నారని అన్నారు రవిబాబు. దీనికి ఉదాహరణగా, లెజెండ్ సినిమాలో అద్భుతమైన విలన్ పాత్ర పోషించిన జగపతి బాబును ప్రస్తావించారు. జగపతి బాబు మంచి ఆర్టిస్ట్ అని రవిబాబు అన్నారు. జగపతి బాబు వంటి తెలుగు నటులు అందుబాటులో ఉన్నా, మలయాళం, తమిళం నుండి విలన్లను ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. రవిబాబు తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలో పెద్దగా ఎవరితోనూ మాట్లాడానని, పబ్లిక్ ప్లేస్‌లకు, ఫంక్షన్లకు వెళ్ళనని చెప్పారు. ఇద్దరు ముగ్గురితో మాత్రమే తన ఇంటరాక్షన్ పరిమితమని తెలిపారు. పెద్ద కమర్షియల్ దర్శకులు తనకు వేషాలు ఇవ్వరని, వారి ఫోన్లు ఎప్పుడూ రాలేదని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..