AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: టాలీవుడ్‌కు మరో విజయ్‌ దేవరకొండ దొరికేశాడు.. ఆ యంగ్ హీరోపై ఆర్జీవీ ప్రశంసల జల్లు

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సాధారణంగా ఎవరినీ పొగడరు. ఒకవేళ ఆయన అలా పొగిడారంటే కచ్చితంగా అవతలి వ్యక్తిలో కచ్చితంగా ఏదో సమ్ థింగ్ స్పెషల్ ఉండే ఉంటుంది. అలా లేటెస్ట్ గా ఒక టాలీవుడ్ యంగ్ హీరోపై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించాడు.

Ram Gopal Varma: టాలీవుడ్‌కు మరో విజయ్‌ దేవరకొండ దొరికేశాడు.. ఆ యంగ్ హీరోపై ఆర్జీవీ ప్రశంసల జల్లు
Ram Gopal Varma
Basha Shek
|

Updated on: Jun 26, 2026 | 10:11 AM

Share

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు కానీ అన్నీ సినిమాలు చూస్తున్నట్లున్నాడు. అంతేకాదు తనకు ఏదైనా సినిమా నచ్చితే చాలు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తాడు. ఆ మధ్యన ధురంధర్, ధురంధర్ ది రివేంజ్ చిత్రాలు ఆర్జీవీకి తెగ నచ్చేశాయి. అందుకే వీటిపై తరచూ పోస్టులు పెట్టి ఆ సినిమాలను తెగ ప్రమోట్ చేశాడు. తాజాగా ఓ తెలుగు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆర్జీవీ. అంతేకాదు అందులో నటించిన ఓ యంగ్ హీరోను ఏకంగా విజయ్ దేవరకొండతో పోల్చాడు. అసలు విషయంలోకి గత వారం విడుదలైన చిన్న సినిమాల్లో దీవానా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా పైగా చిన్న సినిమా అనే ట్యాగ్ తో థియేటర్లలో అడుగు పెట్టిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. పోటీగా సమంత మా ఇంటి బంగారం సినిమా ఉన్నా దీవానా మూవీకి ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించాడు. స్నేహ మణిమేగలై హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

జూన్ 19న విడుదలైన దీవానా సినిమా డీసెంట్ టాక్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను చూశారు. అనంతరం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సినిమా గురించి, అందులోని హీరో గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘ఒక కొత్త నటుడు సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ప్రేక్షకులు మొదట చూసేది ఆటిట్యూడ్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్. ఈ విషయంలో హర్షిత్ రెడ్డి వందకు వంద మార్కులు కొట్టేశాడు. థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ఆడియన్స్ నుంచి వింటున్న మాట ఒక్కటే—లైన్ ఆన్ ది లైన్స్ ఆఫ్ విజయ్ దేవరకొండ!’ అంటూ ఎక్స్ (ట్విట్టర్) లో రాసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఆర్జీవీ పోస్ట్..

దీవానా సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక హర్షిత్ రెడ్డి గతంలో శుభం సినిమాలో హీరోగా నటించాడు. అంతుకు ముందు మెయిల్, కల్కి సినిమాల్లో నటించాడు. అలాగే కొన్ని వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేశాడు.

దీవానా సినిమాలో హీరో హర్షిత్ రెడ్డి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us