ఏపీలో సినిమా టికెట్స్ రేట్లను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో.. సినీ పరిశ్రమ మరింత పుంజుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. అలాగే.. సినిమా టికెట్స్ రేట్స్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం… అటు సినిమా నిర్మాతలకు.. ఇటు ప్రేక్షకులకు మేలు చేస్తుందని సినీ ప్రముఖులు తెలిపారు. తాజాగా కొత్త జీవో పై డైరెక్టర్ రాజమౌళి స్పందించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ కొత్త జీవో ఇచ్చిన ఏపి సిఎం జగన్ కు ధన్యవాదములు తెలుపుతూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
“కొత్త జీవోలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపీ సిఎం జగన్ గారికి.. మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు..
Thanks to the CM of AP @ysjagan garu and @perni_nani garu for aiding the Telugu Film fraternity through the revised ticket pricing in the new G.O. Hope this helps towards the revival of cinemas.
— rajamouli ss (@ssrajamouli) March 9, 2022
అలాగే.. “పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు మాకు మీ నిరంతర మద్దతు కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. తెలంగాణాలో ఇది సినీ వర్గానికి పెద్ద ఊరటనిస్తుది” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
A big thanks to the CM KCR garu and the Telangana govt for permitting 5 shows a day for big films. Also, thanks to @YadavTalasani garu for your continuous support to us. This is a big help to the film fraternity. @TelanganaCMO
— rajamouli ss (@ssrajamouli) March 9, 2022
Also Read: Samantha: నయా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సామ్.. నాగ చైతన్యకు పోటీగానే అంటోన్న నెటిజన్లు..
Samyuktha Menon: భీమ్లానాయక్ బ్యూటీకి ఫిదా అయినా తెలుగు ప్రేక్షకులు.