Rajamouli: మాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది.. నా భార్యను చూసి ఏడ్చేశా.. ఎమోషనల్ అయిన రాజమౌళి

|

Aug 05, 2024 | 10:05 AM

తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో రాజమౌళి ఒకరు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగామారిన రాజమౌళి అన్ని సూపర్ హిట్ సినిమాలను అందించారు. అలాగే తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చేసి రికార్డ్ క్రియేట్  చేశారు. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. బహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు దారి చూపించారు జక్కన్న.

Rajamouli: మాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది.. నా భార్యను చూసి ఏడ్చేశా.. ఎమోషనల్ అయిన రాజమౌళి
Rajamouli
Follow us on

దర్శక ధీరుడురాజమౌళి సినిమాలకు ఉండే కేజ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.. ఓటమి ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో రాజమౌళి ఒకరు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగామారిన రాజమౌళి అన్ని సూపర్ హిట్ సినిమాలను అందించారు. అలాగే తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చేసి రికార్డ్ క్రియేట్  చేశారు. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. బహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు దారి చూపించారు జక్కన్న. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వేదికపై తెలుగు సినిమాను నిలబెట్టారు. హాలీవుడ్ దర్శకులు కూడా రాజమౌళి పనితనాన్ని మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే రాజమౌళి రామ్ చరణ్ తో తెరకెక్కించిన మగధీర సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఈ డాక్యుమెంటరీలో చాలా విషయాలను పంచుకున్నాడు రాజమౌళి. అలాగే మగధీర సినిమాకు సంబందించిన విషయాలను తెలిపారు.

రాజమౌళి మాట్లాడుతూ.. మగధీర షూటింగ్ సమయంలో మాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. మేము ఒక ఏరియాలో డ్రైవ్ చేస్తూ వస్తుంటే అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ అయింది. మా వాళ్లందరికీ అందరికి గాయాలు అయ్యాయి. నా భార్య రమకి బాగా దెబ్బలు తగిలాయి. నడుము కింద స్పర్శ కూడా పోయింది. పక్షవాతం వచ్చింది అనుకున్నాము. దగ్గర్లో హాస్పిటల్ కూడా లేదు. దాంతో మాకు ఏం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు.వెంటనే తెల్సిన డాక్టర్స్ అందరికి ఫోన్స్ చేశాను. అలా డాక్టర్స్ కు ఫోన్ చేస్తూ నా భార్యని చూస్తూ ఏడ్చేసాను అని తెలిపారు. ఆ తర్వాత హాస్పిటల్లో చేరి రికవరీ అయ్యింది రాజమౌళి. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.