AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli : దయచేసి అలాంటివి ఫార్వడ్ చేయకండి.. దేశ పౌరులకు రాజమౌళి సూచన

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి మరో యాక్షన్ అడ్వెంచెరస్ మూవీని తెరకెక్కించేందుకు జక్కన్న రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

SS Rajamouli : దయచేసి అలాంటివి ఫార్వడ్ చేయకండి.. దేశ పౌరులకు రాజమౌళి సూచన
Rajamouli
Rajeev Rayala
|

Updated on: May 09, 2025 | 7:13 PM

Share

జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ సైన్యం సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది. అయితే, పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత సైన్యం కూడా తగిన సమాధానం ఇస్తోంది. ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. సరిహద్దు రాష్ట్రాల్లోని ఉధంపూర్‌, సాంబా, జమ్ము, అఖ్నూర్‌, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అప్రమత్తమైన భారత భద్రత బలగాలు పాకిస్తాన్ డ్రోన్లను గాళ్లోనే కూల్చివేశారు. పాక్‌ నుంచి భారత్‌లోకి వచ్చిన సుమారు 50కిపైగా డ్రోన్లను కూల్చివేసినట్టు భాతర భద్రతా బలగాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఇక భరత్, పాక్ మధ్య  యుద్ధం నేపథ్యంలో సెలబ్రేటీలు సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో ఆర్మీ సమాచారం పంచుకోవద్దన్న రాజమౌళి సూచించారు. సోషల్ మీడియాలో ఏదైనా వార్త లేదా సమాచారం కనిపిస్తే, దానిని గుడ్డిగా నమ్మకండి. అలాగే ఆ మెసేజ్ ను ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని రాజమౌళి సూచించారు.

మనం గుడ్డిగా నమ్మి సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేయడం వల్ల.. అనవసరంగా గందరగోళం, ఆందోళన చెలరేగుతాయని, శత్రువులు కూడా ఇదే కోరుకుంటారని రాజమౌళి అన్నారు. ప్రతిఒక్కరూ సంయమనం పాటించాలని, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని తెలిపారు రాజమౌళి. శాంతంగా, అప్రమత్తంగా ఉండండి చివరకు గెలిచేది మనమే.. అని రాజమౌళి తెలిపారు. రాజమౌళి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉగ్రవాదం నుంచి మన దేశాన్ని కాపాడటానికి ధైర్య సాహసాలు చూపిస్తున్న భారత సైన్యానికి వందనం. శాంతి, ఐక్యతతో కూడిన భవిష్యత్ కోసం ఒక  దేశంగా నిలబడదాం.. అని రాజమౌళి రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి
Rajamouli

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి