Director Rajamouli: జక్కన్న ఖాతాలో మరో క్రేజీ రికార్డ్.. వీడియో గేమ్‌ ప్రపంచంలోకి రాజమౌళి..

బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ రాజమౌళి. దీంతో ఇప్పుడు ఆయన తెరకెక్కించే సినిమాల కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు జక్కన్న. తాజాగా మరో క్రేజీ రికార్డ్ ఖాతాలో వేసుకున్నారు.

Director Rajamouli: జక్కన్న ఖాతాలో మరో క్రేజీ రికార్డ్.. వీడియో గేమ్‌ ప్రపంచంలోకి రాజమౌళి..
Rajamouli

Updated on: Jun 25, 2025 | 10:21 AM

డైరెక్టర్ రాజమౌళి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన జక్కన్న.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు రాజమౌళి పేరు నెట్టింట మారుమోగుతుంది. ఓ జపనీస్ వీడియో గేమ్ లో కనిపించి భారతీయ నటీనటులకు ఎవరికీ సాధ్యం కానీ ఘనత సాధించారు.

జపాన్ లో తెలుగు సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాను అక్కడ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు జక్కన్న. ఆ దేశంలో ట్రిపుల్ ఆర్ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. జపనీస్ వీడియో గేమ్ సృృష్టికర్త హిడియో కోజిమా అప్పట్లో రాజమౌళి కలవడం చర్చనీయాంశమైంది. దీంతో మహేష్ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేయబోతున్నాడా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడు కోజిమా సృష్టించిన డెత్ స్టాండింగ్ 2 వీడియో గేమ్ లో జక్కన్నతోపాటు ఆయన కొడుకు కార్తికేయ సైతం కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఈ ఒక్క వీడియో గేమ్ లో కనిపించి పాన్ వరల్డ్ స్టార్ అయ్యారు జక్కన్న. ఇందులో కనిపించిన భారతీయ తొలి సెలబ్రెటీగా రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం ఈ వీడియో గేమ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న జక్కన్న ఇప్పుడు మహేష్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ లెవల్లో రూపొందించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే వారణాసి సెట్ వేశారని.. ఇది సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్ అని మాట్లాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..