Rajamouli Twitter: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌పై అసహనం వ్యక్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. స్పందించిన యాజమాన్యం.

Rajamouli Twitter: తన సినిమాలను పర్‌ఫక్ట్‌గా ఒక శిల్పాన్ని చెక్కినట్లు తెరకెక్కించే దర్శకధీరుడు రాజమౌళి తాజాగా ఢిల్లీ విమానాశ్రయ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో వసతులు లేమిపై ట్విట్టర్‌ వేదికగా వరుస ట్వీట్టు చేశారు. ఇంతకీ విషయమేంటంటే..

Rajamouli Twitter: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌పై అసహనం వ్యక్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. స్పందించిన యాజమాన్యం.
Rajamouli Tweet

Updated on: Jul 02, 2021 | 2:08 PM

Rajamouli Twitter: తన సినిమాలను పర్‌ఫక్ట్‌గా ఒక శిల్పాన్ని చెక్కినట్లు తెరకెక్కించే దర్శకధీరుడు రాజమౌళి తాజాగా ఢిల్లీ విమానాశ్రయ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో వసతులు లేమిపై ట్విట్టర్‌ వేదికగా వరుస ట్వీట్టు చేశారు. ఇంతకీ విషయమేంటంటే.. రాజమౌళి శుక్రవారం ఒంటి గంట ప్రాంతంలో లుఫ్త్‌సానా ఎయిర్‌వేస్‌లో ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌ పోర్ట్‌లో ఉన్న వసతుల గురించి రాజమౌళి ట్వీట్‌ చేస్తూ..
‘అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆ సమయంలో ఎయిర్‌ పోర్ట్‌ యాజమాన్యం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కోసం ఫామ్‌ను నింపమని ఇచ్చారు. అయితే వాటిని నింపడానికి అక్కడ కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో కొందరు ప్రయాణికులు గోడలకు ఆనుకుని.. మరి కొంతమంది నేలపైనే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చారు. అక్కడ పరిస్థితి చూడడానికి బాగాలేదు. వీటికోసం చిన్న టెబుల్‌నైనా ఏర్పాటు చేయాల్సింది. ఇక ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్‌ వద్ద వీధి కుక్కులున్నాయి. ఇలాంటి వాటిని చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఓసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి’ అంటూ రాజమౌళి ట్వీట్‌ చేశారు.

రాజమౌళి చేసిన ట్వీట్‌..

ఇదిలా ఉంటే రాజమౌళి చేసిన ట్వీట్‌పై ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ యాజమాన్యం స్పందించింది. రాజమౌళి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ పట్ల ధన్యవాదాలు తెలిపిన ఎయిర్‌ పోర్ట్‌ యాజమాన్యం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ట్వీట్‌ చేసింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష సంబంధిత అంశాల కోసం నిర్దేశిత ప్రదేశాల్లో డెస్క్‌లు ఉన్నాయని, మరికొన్ని ప్రదేశాలలో డెస్క్‌లు పెంచుతామని, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కనిపించేలా బోర్డులు అత్యవసరంగా ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ ట్వీట్టర్‌ వేదికగా ప్రకటించింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ స్పందన..

Also Read: Rajinikanth’s Annaatthe: దీపావళికే సూపర్ స్టార్ సినిమా.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్

Kangana Ranaut’s Thalaivi : ఆకట్టుకుంటున్న కంగనా ‘తలైవి’మూవీ స్టైల్.. నెట్టింట వైరల్

YS Jagan Biopic: సీఎం వైఎస్ జగన్ బయోపిక్‌కు రంగం సిద్దం.. హీరోగా ఎవరో తెలుసా.?