
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఇన్నాళ్లు SSMB 29 పేరుతో ఈసినిమా చిత్రీకరణ జరగ్గా.. ఇటీవల గ్లోబ్ ట్రోటర్ వేడుక నిర్వహించి ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వేడుకను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటిలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సినిమా గ్లింప్స్ వీడియోలో మహేష్ లుక్స్, నందీశ్వరుడిపై ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మహేష్ లుక్స్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. సినిమాలో నందీశ్వరుడిపై వస్తున్నట్లుగానే గ్లోబ్ ట్రోటర్ వేడుకలోనూ వృషభం (బొమ్మ)పై ఎంట్రీ ఇచ్చారు మహేష్.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
సినిమాలో మాదిరిగానే గ్లోబ్ ట్రోటర్ వేడుకలోనూ మహేష్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సీన్ కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో తాజా వీడియోను చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా మేకర్స్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఆ వీడియో చూసి అభిమానులు, ప్రేక్షకులు జక్కన్న కష్టం, సినిమా అంటే ఉన్న ఇష్టం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక హీరోను అభిమానుల అంచనాలకు మించి తీసుకువచ్చేందుకు ఎంతగా కష్టపడుతున్నారో తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. అలాగే మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభ పాత్రో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..