AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Varma: హనుమాన్ పాత్రకు ఆయన ప్రాణం పోశారు.. రిషబ్ శెట్టిపై ప్రశాంత్ వర్మ ట్వీట్..

ఈ ఏడాది సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండానే అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా జై హనుమాన్ సినిమాను రూపొందిస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం దీపావళి సందర్భంగా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Prashanth Varma: హనుమాన్ పాత్రకు ఆయన ప్రాణం పోశారు.. రిషబ్ శెట్టిపై ప్రశాంత్ వర్మ ట్వీట్..
Jai Hanuman
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2024 | 3:28 PM

Share

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి చెప్పక్కర్లేదు. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ రానుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ పెరిగింది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటీ ? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఇందులో ఆంజనేయ స్వామి పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోస్ నటిస్తారని అనేక రూమర్స్ వినిపించాయి. కానీ ఇటీవల దీపావళి సందర్భంగా జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అసలు విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రలో కన్నడ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా తన ప్రాజెక్టులో భాగమైన రిషబ్ శెట్టికి ధన్యవాదాలు చెప్పారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో “ఈ ప్రాజెక్టులో భాగమైన.. జాతీయ అవార్డు అందుకున్న నటుడు రిషబ్ శెట్టికి ధన్యవాదాలు. హనుమాన్ పై ఆయనకున్న భక్తి, అసమానమైన అంకితభావం ఆ పాత్రకు నిజంగా జీవం పోశాయి. అద్భుతమైన పరివర్తన, పరిపూర్ణత, తిరుగులేని నిబద్ధత జై హనుమాన్ సినిమాను అసాధారణమైనదిగా ఆయన మార్చారు. ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులకు మరపురాని అనుభూతిని అందించడానికి ఆయన అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. మీతో కలిసి ఈ ప్రయాణాన్ని ఆరంభించినందుకు ఆనందంగా ఉంది” అని రాసుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ లుక్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. అందులో రిషబ్ శెట్టికి సీన్ వివరిస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

త్వరలోనే జై హనుమాన్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా తేజ సజ్జా హనుమంతు పాత్రలోనే కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొందరు స్టార్స్ కూడా జై హనుమాన్ మూవీలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందే అధీర, మహాకాళి చిత్రాలు విడుదల కానున్నట్లు గతంలోనే ప్రశాంత్ వర్మ ప్రకటించారు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు