Salaar: ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్.. పార్ట్ 2లో మాత్రం అలా జరగదంటూ..

|

Dec 24, 2024 | 8:45 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ విడుదలై సుమారు ఏడాది గడిచింది. అప్పటికే 'రాధే-శ్యామ్', 'ఆదిపురుష్' వరుస పరాజయాలు ఎదుర్కొన్న ప్రభాస్‌కి 'సలార్' సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Salaar: ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్.. పార్ట్ 2లో మాత్రం అలా జరగదంటూ..
Salaar
Follow us on

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ సినిమా నాకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే ‘సలార్ 2′ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాన్నాను, ఈ సినిమా నా కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. ‘సలార్’ సినిమా బాక్సాఫీస్ పర్ఫామెన్స్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘సలార్’ సినిమాతో నేను పూర్తిగా హ్యాపీగా లేను. ‘సలార్‌’ మొదటి భాగానికి నేను చేసిన ప్రయత్నం పట్ల అసంతృప్తిగా ఉన్నాను. చాలామంది దీనిని ‘కేజీఎఫ్ 2’ సినిమాలా ఉందన్నారు. నేను ఇంకా మంచి క్వాలిటీ సినిమా తీయాల్సి ఉంది. ఈ కారణంగానే ‘సలార్ 2’ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాను. ఇది ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ది బెస్ట్ అవుతుంది. ప్రేక్షకులు ఆశించిన దానికంటే ఎక్కువే అందించబోతున్నానన్న నమ్మకం నాకుంది. నేను దేనిపైనా పూర్తి నమ్మకం ఉంచను. అయితే ‘సలార్ 2’ సినిమాపై మాత్రం చాలా ఆశలు ఉన్నాయి అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు.

 

ఇవి కూడా చదవండి

‘సలార్’ సినిమా డిసెంబర్ 2023లో విడుదలైంది.అయితే ఈ సినిమా ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ‘ఉగ్రం’కి రీమేక్ అని ప్రచారం జరిగింది. అయితే ‘సలార్ 2’ సినిమాకు మాత్రం డిఫరెంట్ కథను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రేజీ సీక్వెల్ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని కూడా హోంబాలే ఫిల్మ్స్ నిర్మించనున్నారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయనున్నాడు. వీటితో పాటు ‘సలార్ 2’ కల్కి 2 సినిమాలు కూడా ప్రభాస్ చేతిలో ఉన్నాయి.

 

 

అంచనాలకు మించి సలార్ పార్ట్ 2 ఉంటుంది: ప్రశాంత్ నీల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి