
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన.. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ముందుగా హనుమాన్ సినిమాను తెరకెక్కించారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ వసూళ్లు సునామీ సృష్టించింది. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. హనుమాన్ తర్వాత తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస ప్రాజెక్ట్స్ విడుదల చేయనున్నారు ప్రశాంత్ వర్మ. ఇందులో భాగాంగా మూడో సినిమాగా మహాకాళి ఫీమేల్ సూపర్ హీరో సినిమాను రెడీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించనున్నారు. ఇందుకు సంబంధించి తాజా అప్డేట్ షేర్ చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా కనిపించనున్నట్లు తెలుపుతూ ఆయనకు సంబంధించిన పోస్టర్ షేర్ చేశారు. “దేవతల నీడలో కాంతివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు… ” అంటూ పోస్టర్ పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
గతంలో ఈ మహాకాళి ప్రాజెక్ట్ గురించి ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “మా యూనివర్స్ కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం” అని అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
In the shadows of gods,
rose the brightest flame of rebellion 🔥Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal 'Asuraguru SHUKRACHARYA' from #Mahakali 🔱❤️🔥@PujaKolluru @RKDStudios #RKDuggal #RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/mclj39Q8z9
— Prasanth Varma (@PrasanthVarma) September 30, 2025
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?