Priya Prakash Varrier: కన్నుకొట్టి ఫేమస్ అయిన హీరోయిన్.. పాపం ఐదేళ్లలో అన్ని మర్చిపోయిందంట..

|

Jun 08, 2023 | 8:31 AM

కానీ ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో అంతే త్వరంగా ప్రేక్షకులకు దూరమైంది. ఇప్పటికీ అవకాశాల కోసం సెర్చింగ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ వింక్ బ్యూటీ అక్కడ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

Priya Prakash Varrier: కన్నుకొట్టి ఫేమస్ అయిన హీరోయిన్.. పాపం ఐదేళ్లలో అన్ని మర్చిపోయిందంట..
Priya Prakash Varrier
Follow us on

ప్రియా ప్రకాష్ వారియర్.. ఒక్క సీన్‏తో సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ అయిపోయింది. అంతేకాదు.. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ అమ్మాయి కన్ను కొట్టే వీడియోస్ వైరలయ్యాయి. 2010లో విడుదలైన ఓరు అదార్ లవ్ చిత్రంలో కన్ను కొట్టిన సీన్ (వైరల్ వింక్)తో పాపులారిటీని సొంతం చేసుకోవడమే కాకుండా.. హీరోయిన్‏గా కుర్రాళ్ల మనసులు దోచేసింది. అప్పట్లో ఈ ఒక్క సీన్ ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. కానీ ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో అంతే త్వరంగా ప్రేక్షకులకు దూరమైంది. ఇప్పటికీ అవకాశాల కోసం సెర్చింగ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ వింక్ బ్యూటీ అక్కడ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

ప్రియా మాట్లాడుతూ.. “ఆ సినిమాలో కన్ను గీటే ఐడియా తనదే అని… సినిమా షూటింగ్ సమయంలో తాను ఐడియా ఇవ్వడం వల్లే ఆ షాట్ ను దర్శకుడు పెట్టారు” అంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యిందని పేర్కొంది. అయితే ప్రియా మాటలపై డైరెక్టర్ ఓమర్ లూలూ స్పందించారు. “పాపం పిచ్చి పిల్ల.. ఐదేళ్ల క్రితం జరిగిన విషయాలను మర్చిపోయినట్లుంది. వలియ చందనాది అనే ఈ తైలం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది” అంటూ కౌంటరిచ్చాడు. అంతేకాకుండా.. ప్రియా ప్రకాష్ మాట్లాడిన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఆ వీడియోలో ఈ ఐడియా హీరో రోషన్ ది అన్నట్లుగా మాట్లాడింది ప్రియా. మొత్తానికి ఒక్క సీన్ గురించి ప్రతి సందర్భంలోనూ రకరకాలుగా మాట్లాడం చూసి ప్రియాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షెరీఫ్, రోషన్ అబ్దుల్ రహూఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.