
తెలుగులో ఉన్న ది మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో నాగ్ అశ్విన్ ఒకరు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం మహానటి, కల్కి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లింది. ముఖ్యంగా కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ వంటి ఎంతో మంది స్టార్స్ ను హ్యాండిల్ చేసిన విధానం అందరి మన్ననలు అందుకుంది. ప్రస్తుతం కల్కి 2 సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు నాగ్ అశ్విన్. కాగా కేవలం డైరెక్టర్ గానే కాకుండా అప్పుడప్పుడు నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు అశ్విన్. అలా ఇప్పుడు వైజయంతీ మూవీస్ సమర్పణలో ‘సింగ్ గీతం’ అనే సినిమాను నిర్మిస్తున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (జూన్ 06) చెన్నైలో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. లోకనాయకుడు, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
‘సింగ్ గీతం’ ఈవెంట్ కు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు వచ్చారు. దీంతో గెస్టుల గ్యాలరీలో అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు కూర్చోవడానికి సీట్లు సరిపోలేదు. ఈ క్రమంలోనే తన సినిమా ఈవెంట్‌కు వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావించిన నాగ్ అశ్విన్..ఎలాంటి భేషజాలకు పోకుండా నేల మీద కూర్చుండిపోయారు. తాను ఒక స్టార్ డైరెక్టర్ ని అనే విషయాన్ని పక్కన పెట్టి, సోఫాల పక్కనే కిందనే చాలా సేపు కూర్చుండిపోయారు. కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ పక్కన కూర్చునే ఛాన్స్ ఉన్నప్పటికీ అతిథుల కోసం నాగ్ అశ్విన్ ఇలా కింద కూర్చోవడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగ్ అశ్విన్ సింప్లిసిటీపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఏంటండీ ఈ మనిషి…
ఈయనేనా కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన #Mahanati తీసింది…ఈయనేనా ప్రపంచాన్ని ఊపేసిన #Kalki తీసింది… మరో అద్భుతం #Kalki2 తీస్తున్నది
దీన్ని సింపుల్ గా సింప్లిసిటీ అని కూడా అనలేం…అంతకు మించి ఏదో
మీలాగా ఉండాలి అని అనుకుంటాం…కానీ ఒక్కరోజు కూడా ఉండలేం…
Huge… pic.twitter.com/dGOR8EjCdB— Taraq(Tarak Ram) (@tarakviews) June 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.