
టాలీవుడ్ లో వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న దర్శకుల్లో మెహర్ రమేష్ ఒకరు. ఈయన కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ తో రెండు సినిమాలు చేసి మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేశాడు. కన్నడలో చేసిన రెండు సినిమాలు కూడా తెలుగు సినిమా రీమేకులే ఒకటి మహేష్ బాబు ఒక్కడు, రెండవది ఎన్టీఆర్ ఆంధ్రావాలా. ఇక తెలుగులో 2008లో జూనియర్ ఎన్. టి. ఆర్ హీరోగా కంత్రితో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కంత్రి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలట్టుకోలేకపోయింది. ఆతర్వాత ఆయన బిల్లా, శక్తి, షాడో , భోళా శంకర్ సినిమాలు చేశాడు. వీటిలో బిల్లా సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆ సినిమా కూడా హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన డాన్ సినిమాకు రీమేక్. ఇక చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు దర్శకత్వం వహించాడు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది . ఈ సినిమా తమిళ్ లో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్. ఈ సినిమా రిలీజ్ సమయంలో మెహర్ రమేష్ సినిమా పై చేసిన కామెంట్స్ కు సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ కు సంబంధం లేకపోవడంతో ఆయన పై ట్రోల్స్ వెల్లువెత్తాయి.
భోళా శంకర్ సినిమా తరవాత మెహర్ రమేష్ పెద్దగా ఎక్కడ కనిపించలేదు. ఈవెంట్స్ లోనూ మెహర్ ఎక్కువగా కనిపించలేదు. మహేష్ బాబు తండ్రి కృష్ణ వర్ధంతి రోజున కనిపించారు మెహర్ రమేష్. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మెహర్ రమేష్. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఎప్పటికైనా పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తాను అని అన్నారు. తన దగ్గర ఇప్పటికే అదిరిపోయే కథ ఉందని.. సినిమా పక్క తీస్తాను అని అన్నారు. ప్రస్తుతానికైతే మెహర్ ఏ సినిమాను అనౌన్ చేయలేదు. నెక్స్ట్ఈ డైరెక్టర్ ఎవరితో సినిమా తీస్తారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.