Puneeth Raj Kumar: పునీత్ మరణంతో శోకసంద్రంలో చిత్రపరిశ్రమ.. ఆ కోరిక తీరకుండానే అనంతలోకాలకు అప్పు..

|

Oct 31, 2021 | 1:42 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ అకాల మరణంతో

Puneeth Raj Kumar: పునీత్ మరణంతో శోకసంద్రంలో చిత్రపరిశ్రమ.. ఆ కోరిక తీరకుండానే అనంతలోకాలకు అప్పు..
Puneeth Raj Kumar
Follow us on

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ అకాల మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణం యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులతో పునీత్‏కు మంచి అనుబంధాలున్నాయి. నిన్న శనివారం.. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి సినీ ప్రముఖులు బెంగుళూరుకు వెళ్లి పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించారు.

ఈ క్రమంలోనే తన పునీత్ తన చిరకాల కోరిక నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారని డైరెక్టర్ మెహర్ రమేష్ ఎమోషనల్ అయ్యారు.. పునీత్ కారణంగానే తాను వెండితెరకు పరిచయమయ్యానని.. పునీత్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన రెండవ ప్రాజెక్ట్ కూడా పునీత్ తో చేసినట్లుగా గుర్తుచేసుకున్నారు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ చిరంజీవితో భోళా శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన వెంటనే పునీత్ తనకు కాల్ చేశాడని.. తను ఎలాగైన చిరంజీవితో నటించాలని ఉందని.. బోళా శంకర్ సినిమాలో ఏదైనా గెస్ట్ రోల్.. లేదా చిన్న స్టెప్పులు వేస్తానని పునీత్ కోరినట్లుగా మెహర్ రమేష్ తెలిపారు. ఇదే విషయాన్ని చిరంజీవితో చెప్పానని.. పునీత్ కోసం సినిమాలో ఓ స్పెషల్ రోల్ కూడా రాయాలనుకున్నాని.. అలాగే నవంబర్ ‏లో జరగనున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి పునీత్ ను ముఖ్య అతిథిగా పిలవాలనుకున్నట్లుగా చెప్పారు. ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధగా ఉందని ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈరోజు ఉదయం బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛానాలతో నిర్వహించారు.. వేలాది మంది అభిమానులు.. కుటుంబసభ్యులు .. పలువురు ప్రముఖుల మధ్య పునీత్ అంత్యక్రియలు జరిగాయి.

Also Read: Nawazuddin Siddiqui: ఇక పై వెబ్ సిరీస్‏లలో నటించను.. ఓటీటీ కంటెంట్ నచ్చట్లేదు.. నవాజుద్ధీన్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 5 Telugu Elimination: ఈవారం ‏బిగ్‏బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది అతడే.. ఎవరంటే…