Director Maruthi : టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మారుతి. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ.. దానికి కావాల్సినంత కామెడీని జత చేసి హిట్స్ అందుకుంటున్నాడు దర్శకుడు మారుతి. ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాల్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చివరగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండుగే సినిమాతో మంచి విజయం అందుకున్నారు. తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్‌తో కలిసి మంచి రోజులు వచ్చాయి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటుగా గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మారుతి ఓ భారీ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.
అయితే మారుతి ఈ సారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట ఈ యంగ్ డైరెక్టర్. ఇటీవలే మారుతి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక లైన్ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. లైన్ నచ్చడంతో.. పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని మెగాస్టార్ చెప్పడంతో ఇప్పుడు ఆ పనిలో మారుతి ఉన్నాడని తెలుస్తుంది. బాస్ ఓకే అనడంతో మెగాస్టార్ గతంలో నటించిన ‘శంకర్ దాదా’ తరహాలో ఓ కథను మారుతి సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ప్రధానంగా ఉండేలా కథను రాస్తున్నాడట మారుతి. చిరంజీవి కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత మారుతి సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :