శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఒకేఒక జీవితం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా డైరెక్టర్ శ్రీకార్తిక్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటించగా.. అక్కినేని అమల.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటించారు. విడుదలైన మొదటి రోజే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ. ఈ సినిమా చూసిన నాగార్జున ఎమోషనల్ అయ్యారు కూడా.. అయితే అమల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు అక్కినేని యంగ్ హీరో అఖిల్ హాజరుకాలేదు.
ప్రీరిలీజ్ ఈవెంట్ కు అఖిల్ హాజర్ఫావుతాడని ప్రకటించారు. కానీ అఖిల్ రాలేదు. దాంతో అఖిల్ ఎందుకు రాలేదు అన్న చర్చ తలెత్తింది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకార్తీక్ మాట్లాడుతూ ఆ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. ఈ సినిమాను చూసిన అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత ఆయన మామూలు మనిషి కావడానికి రెండు రోజులు పట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే ఎమోషనల్ గా తనని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమని భావించే ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నాడు అని తెలిపాడు కార్తీక్. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..