Indraganti Mohan Krishna: నిర్మాతగా మారనున్న మరో దర్శకుడు.. ఇంద్రగంటి ఎవరితో సినిమా చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్‌లో మంచి అభిరుచి ఉన్న దర్శకులలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒకరు. అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా మారిన ఇంద్రగంటి ఎన్నో మంచి సినిమాలను..

Indraganti Mohan Krishna: నిర్మాతగా మారనున్న మరో దర్శకుడు.. ఇంద్రగంటి ఎవరితో సినిమా చేస్తున్నారో తెలుసా..?
Indraganti

Updated on: Aug 19, 2021 | 9:41 PM

Indraganti Mohan Krishna: టాలీవుడ్‌లో మంచి అభిరుచి ఉన్న దర్శకులలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒకరు. అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా మారిన ఇంద్రగంటి ఎన్నో మంచి సినిమాలను అందించారు. కథాకథనాలను ఆయన నడిపించే తీరు ప్రేక్షకులను అలరిస్తుంది. అష్టాచమ్మా సినిమా తర్వాత జెంటిల్ మాన్, సమ్మోహనం వంటి సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఇంద్రగంటి. ఆయన సినిమాలు చాల సహజంగా అనిపిస్తూ ఉంటాయి. కామెడీని, ఎమోషన్స్‌ను సమపాళ్లలో నడిపిస్తూ విజయాలను అందుకుంటున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఇక ఈ టాలెంటెడ్ డైరెక్టర్ రీసెంట్‌‌‌గా ‘వి’ అనే మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు కలిసి నటించారు. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. ‘వి’ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఇక ఇప్పుడు సుధీర్ బాబుతో మరో సినిమా చేస్తున్నారు ఇంద్రగంటి. ఈ సినిమాకు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్‌‌ను పరిశీలిస్తున్నారు. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇప్పుడు నిర్మాత అవతారమెత్తనున్నారని తెలుస్తుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ వారితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. ఈ సినిమాలో అంతా కొత్తవారే నటించనున్నారని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. దర్శకుడిగా సక్సెస్ అయినా ఇంద్రగంటి నిర్మాతగా రాణిస్తారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood: టాలీవుడ్‌లో మరో రచ్చ.. నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న థియేటర్ల ఓనర్లు.. కారణం ఇదే..

Nithin’s Maestro: నానితో పోటీకి సై అంటున్న నితిన్.. ఓటీటీలో తలపడనున్న సినిమాలు..

Bollywood : బాలీవుడ్ సెలబ్రిటీలకు ముచ్చెమటలు.. ఆ వీడియోలు సేకరించిన గ్యాంగ్.. ఏకంగా 100 మంది

Loading...
Unable to load recommendations.
Follow Us