పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవన్ ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవధీయుడు భగత్ సింగ్ సినిమా చేయనున్నాడు. ఇంకా సెట్స్ పైకీ వెళ్లని ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడని..అంతేకాకుండా సరికొత్త లుక్ లో ఉండబోతున్నాడని టాక్ వినిపించింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ రాలేదు.. తాజాగా భవధీయుడు భగత్ సింగ్ సినిమా గురించి .. డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ రోల్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లుగా తెలుస్తోంది.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఇంట్రెస్టింగ్ గా నిలుస్తుంది. ఇందులోని పవన్ డైలాగ్స్ మరింత ప్రత్యేకంగా ఉండబోతున్నాయి.. అంతేకాకుండా.. పవన్ లుక్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకోనున్నాయి. ఈ మూవీని ఆగస్టులో సెట్స్ పైకీ తీసుకెళ్లబోతున్నాము.. పవర్ స్టార్ మొదటి సారిగా లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడు.. సూపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. హైదరాబాద్, ఊటీలో ఈ సినిమా చిత్రీకరణ చేయాలనుకుంటున్నాము.. ఇందులో 80 శాతం హైదరాబాద్ లో జరుగుతుంది అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. . ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఎగ్జైటింగ్ గా ఉంటుందన్నారు. పవన్ తో పనిచేసే సమయంలో తాను ఎప్పుడూ ఓ అభిమానిలా మాత్రమే చూస్తానని తెలిపారు.