‘చిన్నోడు ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’.. మాస్ డైరెక్టెర్ ఊరమాస్ ట్వీట్..

హోలీ పండుగ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్..తన కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకున్న ఫోటోను షేర్ చేస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలో తారక్‌తో పాటు భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు ఉన్నారు. అందరూ వైట్ డ్రెస్సులలో ముఖానికి రంగులు పూసుకుని ఉన్న ఫోటో మంగళవారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తారక్ అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఆ ఫోటోపై స్పందించారు. టాలీవుడ్ ఊరమాస్ డైరెక్టర్ […]

‘చిన్నోడు ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’.. మాస్ డైరెక్టెర్ ఊరమాస్ ట్వీట్..
Follow us

|

Updated on: Mar 11, 2020 | 8:15 AM

హోలీ పండుగ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్..తన కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకున్న ఫోటోను షేర్ చేస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలో తారక్‌తో పాటు భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు ఉన్నారు. అందరూ వైట్ డ్రెస్సులలో ముఖానికి రంగులు పూసుకుని ఉన్న ఫోటో మంగళవారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

తారక్ అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఆ ఫోటోపై స్పందించారు. టాలీవుడ్ ఊరమాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తనదైన స్టైల్‌లో ఆ పిక్‌పై కామెంట్ చేశారు. “తారక్ రెండో అబ్యాయి కెమెరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతోంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు” అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

కాగా తారక్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి తార‌క్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ముగియనుంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ చేయనున్న సినిమా మే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.