AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నాంది’ టీజర్ చూసి షాక్ అయ్యా.. నరేష్ గట్స్ కి హ్యాట్సాప్.. నవ్విస్తూ సడన్ గా ఏడిపించడం చాలా కష్టం..

గమ్యం, నేను, శంభో శివ శంభో, వంటి సీరియస్ క్యారెక్టర్స్ లో నటించి.. నరేష్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాదు.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కూడా చేయగలడు అని నిరూపించుకున్నారు.

'నాంది' టీజర్ చూసి షాక్ అయ్యా.. నరేష్ గట్స్ కి హ్యాట్సాప్.. నవ్విస్తూ సడన్ గా ఏడిపించడం చాలా కష్టం..
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2021 | 5:39 PM

Share

Naandhi Movie : గమ్యం, నేను, శంభో శివ శంభో, వంటి సీరియస్ క్యారెక్టర్స్ లో నటించి.. నరేష్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాదు.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కూడా చేయగలడు అని నిరూపించుకున్నారు. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’లో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి అందరిచేత శభాష్ అనిపించుకుని నటుడిగా మరో మెట్టు పైకి ఎదిగాడు నరేష్. తాజాగా అల్లరి నరేష్ “నాంది” అంటూ మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రాక్ లో జయమ్మగా నటించి మంచి పేరు సంపాదించుకొన్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఆద్యగా పవర్ ఫుల్ లాయర్ క్యారెక్టర్ లో నటించింది. నవమి హీరోయిన్ గా యస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ కనకమేడలని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సతీష్ వేగేశ్న “నాంది” చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన “నాంది” టీజర్, ట్రైలర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.. నరేష్ 57వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి19న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా ఇటీవలే ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “నాకు ఇవివి గారంటే చాలా అభిమానం. ప్రతీ సినిమాకి ఆయన దెగ్గర ఎప్పుడూ ఒక పదిమంది రైటర్స్ వర్క్ చేస్తుంటారు. అలా నేనుకూడా ఆపదిమందిలో ఒక రైటర్ ని అవుదామని ఇండస్త్రికి వచ్చాను. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. నరేష్ కూడా ఎంతో మంది కొత్తదర్శకులను ఇండస్త్రీకి పరిచయం చేశారు. నాందితో విజయ్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా నరేష్ కి థాంక్స్. విజయ్ కల, కష్టం రెండూ నెరవేరిన రోజు ఇవాళ. ఒక డిఫరెంట్ సినిమా టీజర్ తోనే అందర్నీ ఆకట్టుకున్నాడు విజయ్. నాంది టీజర్ చూసి షాక్ అయిపోయాను.  డిఫరెంట్ జోనర్స్ లో నాంది చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. మహర్షి లో మా వంశీ అల్లరి నరేష్ ని ఒక కొత్త యాంగిల్ లో చూపించాడు. అప్పట్నుంచీ అల్లరి నరేష్ అనిపిలవటం మానేసి యాక్టర్ నరేష్ అని పిలుస్తున్నారు. ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్ లో విజయ్ నరేష్ ని చూపించాడు. ఇప్పటివరకూ ఒక 56 సినిమాలు చేసి నవ్విస్తూ.. నవ్విస్తూ సడన్ గా ఏడిపించడం చాలా కష్టం. ఈ సినిమా ఒప్పుకొని చేసినందుకు నరేష్ గట్స్ కి హ్యాట్సాప్. ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడమే బెస్ట్ సక్సెస్ అని నమ్ముతున్న” అంటూ చిత్రయూనిట్ కు శుభాకంక్షాలు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhil Sarthak And Monal Gajjar: ‘ఆ ప్రాజెక్ట్‌ను అఖిల్ కోసమే ఓకే చేశాను’.. మోనాల్ గజ్జర్ ఆసక్తికర వ్యాఖ్యలు..